ఏపీ ఎన్నికల్లో దొంగ ఓట్లు.. నేతల ఫీట్లు....!
తాజాగా వెలువరించిన కేంద్ర ఎన్నికల సంఘం జాబి తా ప్రకారం.. 4 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇదే ఇప్పుడు.. రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీని కలవరపెడుతున్నాయి.
ఏపీలో ఎన్నికలకు మరో రెండు మాసాల గడువు ఉంది. ఇప్పటికే తొలి దఫా ఓటర్ల జాబితా కూడా వచ్చే సింది. రాష్ట్రంలో 5 కోట్ల పైచిలుకు ప్రజలు ఉంటే.. తాజాగా వెలువరించిన కేంద్ర ఎన్నికల సంఘం జాబి తా ప్రకారం.. 4 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇదే ఇప్పుడు.. రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీని కలవరపెడుతున్నాయి. దీంతో ఒకరిపై ఒకరు దొంగ ఓట్ల ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైసీపీ లెక్కకు మించి దొంగ ఓట్లు వేయించేందుకు రెడీ అయిందని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని నమూనాగా తీసుకుంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 70 వరకు ఉంటాయని టీడీపీ అధినేత చం ద్రబాబు వాదన. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్చారని.. చనిపోయిన వారి పేర్లతో కూడా ఓట్లు కల్పించారని.. టీడీపీ చెబుతోంది. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. టీడీపీనే దొంగ ఓట్లు సృష్టించిందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో ఓటు ఉన్న వారిని కూడా తీసుకువచ్చి.. ఏపీలో ఓటు వేయించేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోందన్నది వైసీపీ నాయకుల విమర్శ. ఇదే విషయంపై ఇటీవల సాయిరెడ్డి కూడా చెప్పుకొచ్చారు. దీంతో దొంగ ఓట్లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ.. ఈ రెండు పార్టీల నాయకులకు మాత్రం ఈ విషయం రాజకీయ సబ్జెక్టుగా మారిపోయింది. ఇదిలావుంటే.. ఇతర పార్టీలు ఈ విషయంలో మౌనంగా ఉన్నాయి. వాస్తవానికి కమ్యూనిస్టులు ఒకప్పుడు దొంగ ఓట్లపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేవారు.
బీజేపీ కూడా గత ఎన్నికలకు ముందు.. ఇదే వాదన తీసుకువచ్చింది. కానీ, ఇప్పుడు అటు కమ్యూనిస్టులు కానీ.. ఇటు బీజేపీ నాయకులు కానీ.. మాట్లాడడం లేదు. పైగా.. తమకు ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో ఏపీలో ఈ దొంగ ఓట్ల వ్యవహారం.. టీడీపీ-వైసీపీల మధ్యే పోరుగా కనిపిస్తోంది. ఇది ఎన్నికలను ప్రబావితం చేసే అంశమని ఇరు పార్టీలు చెబుతున్న కామన్ మ్యాటర్. అయితే.. ఎవరు ఈ దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారనేది మాత్రం ఎవరికి వారే.. వేళ్లు చూపించుకుంటున్నారు. దీనికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి. ఈ నెల 20న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.