"వన్ టు సిక్స్"... కొడుకుకి వినూత్నంగా పేరు పెట్టిన తండ్రి!

వివరాళ్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సీహెచ్ రాఘవేంద్ర అనే వ్యక్తి తన కుమారుడికి వినూత్నంగా పేరు పెట్టారు.

Update: 2024-10-09 04:03 GMT

ఈ సమాజంలో మనిషికి మనిషికి గోడ కట్టడంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందని చాలా మంది భావిస్తుంటారు కానీ.. అంతకంటే బలంగా పనిచేసేవి కులం, మతం అని చాలా మంది నమ్ముతుంటారు. భారతదేశానికి ఉన్న సమస్య జనాభానో, పేదరికమో, అవినీతో, నిరక్షరాస్యతో కాదు.. కులమూ, మతమూ అనేవారే ఎక్కువ! ఈ నేపథ్యంలో ఓ తండ్రి వినూత్నంగా ఆలోచించారు.

అవును... ఇంటి పేరును బట్టి అవతలి వ్యక్తి ఏ సామాజిక వర్గానికి చెందిన వాడు అని ఓ అవగాహనకు వచ్చి మరీ మాట్లాడే విధానంలో మార్పులు చూపించే జనాలున్న సమాజం ఇది! పేరు చివర అక్షరాలను బట్టి.. ప్రేమ, స్నేహం చిగురించే రోజులుగా మారిన పరిస్థితి! అయితే.. మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని ఈ ప్రపంచానికి తన వంతుగా చెప్పాలని భావించారు ఓ తండ్రి. ఈ సందర్భంగా తన కొడుకు పేరుతో అది మొదలుపెట్టాడు.

వివరాళ్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సీహెచ్ రాఘవేంద్ర అనే వ్యక్తి తన కుమారుడికి వినూత్నంగా పేరు పెట్టారు. దాని వెనుక బలమైన కారణమే ఉంది. తాను చదువుకునే రోజుల్లో స్కూల్ లో కులమత బేదాలు చూపించేవారు కాదు కానీ.. బయట సమాజంలో ఆ తేడా, ఆ భావన స్పష్టంగా కనిపించేదని అన్నారు.

ఈ నేపథ్యంలోనే తన కుమారుడికి డిఫరెంట్ గా పేరు పెట్టాలని భావించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన కుమారుడికి "వన్ టు సిక్స్" అని నామకరణం చేశారు. ఇందులో "వన్" అంటే ఐ, "టూ" అంటే యామ్, "సిక్స్" అంటే ఇండియన్ అని అర్ధం వచ్చేలా తన కుమారుడికి ఆ పేరు పెట్టినట్లు తెలిపారు.

బర్త్ సర్టిఫికెట్, ఆధార్ వంటి ధ్రువపత్రాల్లోనూ ఇదే పేరును నమోదు చేయించారు. “ఐ యామ్ ఇండియన్” అని అర్ధం వచ్చేలా, మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పడానికి తన కుమారుడికి ఈ పేరు పెట్టినట్లు తండ్రి రాఘవేంద్ర తెలిపారు.

Tags:    

Similar News