ఫాదర్స్ డే వెనుక ఆసక్తికరమైన కారణం తెలుసా?
అవును... ఈ ప్రపంచంలో ఎన్నో "డే"లు ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవం, మాతృదినోత్సవం లతో పాటు చాలా దినోత్సవాలే ఉన్నాయి
ఈ రోజు ఫాదర్స్ డే. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని ఎన్నో ఎమోషనల్ కథనాలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో... ఈ వయసులో పిల్లలకు దూరమై ఒంటరిగా గడుపుతున్న, వృద్ధశ్రమంలో ఉన్న పలువురి తండ్రుల కథలూ వైరల్ అవుతున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... ఈ ఫాదర్స్ డే ఎలా వచ్చింది.. దీని వెనుక ఎవరున్నారు.. అసలు ఈ ఫాదర్స్ డే వెనకున్న చరిత్ర ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం!
అవును... ఈ ప్రపంచంలో ఎన్నో "డే"లు ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవం, మాతృదినోత్సవం లతో పాటు చాలా దినోత్సవాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు (జూన్ మూడో ఆదివారం) ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటారు. అయితే... మొట్టమొదటిగా ఈ ఫాదర్స్ డే ని 1910లో జూన్ 19న అమెరికాలో జరుపుకొన్నారు. సొనారో స్మార్ట్ డాడ్ అనే అమ్మాయి ఈ దినోత్సవానికి నాంది పలికింది. ఇది ఆమె ప్రయత్నమే!
వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలో సొనోరా స్మార్ట్ డాడ్ అనే అమ్మాయికి మరో ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. అయితే వీరి తల్లి వీరి చిన్నతనంలోనే మరణించింది. వీరి తండ్రి విలియం జాక్సన్ సైనికుడు. వీరి తల్లి చిన్నతనంలోనే చనిపోయినప్పటికీ... ఆరుగురు బిడ్డలనూ అతడు కంటికి రెప్పలా కాచుకుని పెంచి పెదచేశారట. దీంతో... తన తండ్రి జాక్సన్ కోసం ఈ వేడుకను సొనోరా స్మార్ట్ ప్రారంభించింది.
తల్లిలేని బిడ్డలమైన తమకోసం నాన్న పడిన కష్టం ఆమెకు నిత్యం కళ్లముందు కనిపించేదంత. దీంతో... నాన్న కోసం ఏమైనా చేయాలనుకుందంత. అప్పుడే అనా జార్విస్ మదర్స్ డే జరుపుతున్న విషయం తెలుసుకుందంట. ఈ సమయంలో బిడ్డలకోసం పరితపించే నాన్నల కోసం కూడా ఏదైనా చేయాలని ఫాదర్శ్ డే జరపాలని నిర్ణయించుకుందట. ఇదే విషయాన్ని చర్చి ఫాదర్ కూ చెప్పింది. .
ఇందులో భాగంగా... తన తండ్రి విలియం పుట్టిన రోజు జూన్ 5న ఫాదర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆమె పాస్టర్ కు సూచించింది. అయితే ఏర్పాట్లకు తగినంత సమయం లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని జూన్ మూడో అదివారానికి మార్చారంట. అప్పటి నుంచి జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా చేసుకుంటున్నారు. అయితే... మొదట్లో దీనికి అంత ప్రాధాన్యత లభించలేదట. దీంతో సోనోరా దేశమంతా అవగాహన కార్యక్రమాలు చేపట్టిందంట.
ఈ క్రమంలో ఆమె కృషి ఫలించి.. అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ దీన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారంట. ఆ తర్వాత 1972లో ఈ ఫాదర్స్ డేకి ఐక్యారాజ్య సమితిలోనూ అధికారిక గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ప్రపంచంలోని ప్రతీ మూలా ఈ రోజు ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా... తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతుంది తుపాకీ.కాం!