150 ఎకరాల స్థలం... చివరి వరకూ పోరాడతానంటున్న నటి!

నకిలీ పత్రాలను సృష్టించి తన భూమిని కబ్జా చేసినవారిపై న్యాయపోరాటం చేస్తున్నారు సినీ నటి గౌతమి!

Update: 2024-10-18 10:11 GMT

నకిలీ పత్రాలను సృష్టించి తన భూమిని కబ్జా చేసినవారిపై న్యాయపోరాటం చేస్తున్నారు సినీ నటి గౌతమి! ఈ కేసులో తనకు న్యాయం దక్కేవరకూ పోరాటం ఆగదని ఆమె తెలిపారు. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆమెకు ఉన్న సుమారు 150 ఎకరాల భూముల విషయంలో మోసం చేశారని ఆమె న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

అవును... తనకు న్యాయం జరిగే వరకూ పొరాడతానని అంటున్నారు సినీనటి గౌతమి. రామనాథపురం జిల్లా ముతుకుత్తుర్ సమీపంలో ఆమెకు చెందిన సుమారు 150 ఎకరాల స్థలం అమ్మిపెడతానని కారైకుడికి చెందిన సినీ ఫైనాన్షియర్ ఆళగప్పన్ రూ.3.1 కోట్లు తీసుకొని మోసం చేస్తినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు తన డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ జిల్లా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేశారు.

వాస్తవానికి నటి గౌతమి ఆస్తులను అలగప్పనే నిర్వహించేవారంట. అయితే ఆమెకున్న భూముల్లో ఒక భూమి అమ్మకం విషయంలో రూ.3.16 కోట్లు అతడు మోసం చేశాడని నటి గౌతమి గత మే నెలో ఫిర్యాదు చేశారు. రామనాథపురం జిల్లా క్రైం బ్రాంచ్ లో 23 మే 2024లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ రామనాథపురం జేఎం నెంబర్ 2 కోర్టులో కొనసాగుతోంది.

ఈ కేసులో అలగప్పన్ తో పార్టు అతని భర్య నాచల్, కుమారులు సోక్కలింగం అలగప్పన్, శివ అలగప్పన్, కోడలు ఆర్తి ఈలగప్పన్, ప్రోకర్ నెల్లియన్, పాక్య శాంతి, జోసెఫ్ జయరాజ్, రమేష్ శంకర్ సోయాన్, సంతాన పీటర్, విశాలాక్షి, భాస్కర్ మొదలైన 13 మందిపై కేసు నమోదు చేశారు! ఈ కేసులో అలగప్పన్ మేనేజర్ రమేష్ శంకర్ సోనాయ్ జైలో ఉన్నాడు.

అయితే.. అతడి బెయిల్ పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది. ఈ సమయంలో నటి గౌతమి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మోసానికి ప్రధాన కారణమైన రమేష్ శంకర్ సోనాయ్ కు బెయిల్ మంజూరు చేయవద్దని పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నట్లు తెలిపారు.

ఈ సమయంలో తనకు సహకరించినవారందరికీ తన కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కేసును విచారించగా అన్ని చోట్లా తప్పులు జరిగినట్లు స్పష్టమవుతోందని.. అందువల్ల ఈ కేసును తాను కొనసాగించాల్సి వచిందని.. న్యాయం జరిగేలా చివరి వరకూ తాను పోరాడతానని ఆమె స్పష్టం చేశారు!

Tags:    

Similar News