ఫిట్ బిట్ స్టార్ట్ వాచ్ తో ప్రియుడితో రిలేషన్ ఫట్

దీంతో, ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ తనతో లేడని గుర్తించిన సదరు ప్రియురాలు తన ప్రియుడు మోసం చేస్తున్నాడని పసిగట్టింది.

Update: 2024-01-03 23:30 GMT
ఫిట్ బిట్ స్టార్ట్ వాచ్ తో ప్రియుడితో రిలేషన్ ఫట్
  • whatsapp icon

ఈ టెక్ జమానాలో నిత్యజీవితంలో వాడుకునేందుకు ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్ల రాకతో పల్లెలు మొదలు పట్టణాల వరకు ప్రజల లైఫ్ స్టైల్ స్మార్ట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లతో కనెక్ట్ అయ్యే స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ ఏర్పడింది. పొద్దున లేచింది వాకింగ్ మొదలు రాత్రి పడుకోబోయే ముందు పాటించాల్సిన హెల్త్ టిప్స్ వరకు స్మార్ట్ వాచ్ లు చాలామందికి ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. అయితే, ఈ స్మార్ట్ వాచ్ ల వల్ల జల్సా రాయుళ్లయిన ప్రియుళ్లకు కొత్త చిక్కు వచ్చిపడింది.

అనూహ్యంగా ఓ స్మార్ట్ వాచ్ సాయంతో తన బాయ్ ఫ్రెండ్ బండారాన్ని ఓ యువతి బట్టబయలు చేసిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ప్రియుడి నిజస్వరూపాన్ని స్మార్ట్ వాచ్ ద్వారా పసిగట్టిన ప్రియురాలు అతడి గుట్టును సోషల్ మీడియా వేదికగా రట్టు చేసింది. యూకేకి చెందిన నదియా , ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఫిట్ స్మార్ట్ వాచ్ లు కొంతకాలం క్రితం కొనుక్కున్నారు. వారిద్దరూ తమ స్మార్ట్ ఫోన్ లో ఒకరి వాచ్ ను మరొకరు సింక్ చేసుకున్నారు. దీంతో, ప్రియుడు వాకింగ్, జాగింగ్ వంటి ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ చేసినా ఆఖరికి సెక్స్ లో పాల్గొన్న వెంటనే ప్రియురాలికి తెలిసిపోతుంది.

తన ప్రియుడు ఏ టైంలో ఎన్ని క్యాలరీలు ఖర్చుపెట్టాడో ఆమె తెలుసుకోగలదు. ఈ క్రమంలోనే ఓ ఫైన్ డే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తన ప్రియుడు 500 క్యాలరీలు బర్న్ చేసినట్టుగా ఆమె ఫోన్ కు నోటిఫికేషన్ వచ్చింది. దీంతో, ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ తనతో లేడని గుర్తించిన సదరు ప్రియురాలు తన ప్రియుడు మోసం చేస్తున్నాడని పసిగట్టింది. ఇదే విషయాన్ని టిక్ టాక్ లో వీడియో రూపంలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయింది. అయితే, ప్రియుడు ఆ సమయంలో వాకింగ్ కానీ జాగింగ్ గాని పబ్లో డాన్స్ గానీ చేసి ఉంటాడని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

అయితే, మీరంతా అనుకున్నట్లు జరగలేదు అంటూ ఆమె జవాబు ఇచ్చింది. దీంతో, ప్రియుడు ఆమెను మోసం చేసినట్లుగా ఆమెకు తెలిసిపోయిందని మరికొందరు అంటున్నారు. అయితే, ఇలా మోసం చేసే ప్రియుడి బండారాన్ని ఫిట్ బిట్ బట్టబయలు చేయడం ఇది రెండోసారి. 2019లో కూడా ఇలాగే అమెరికాలోని ఓ రిపోర్టర్ తన ప్రియుడు బండారాన్ని బట్టబయలు చేసింది. దీంతో, చాలామంది యువతులు తమ బాయ్ ఫ్రెండ్ లకు కూడా ఫిట్ బిట్ స్మార్ట్ వాచ్ లు కొనిపించి సింక్ చేసుకుని వారిపై నిఘా పెట్టాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో, యువకులు ఫిట్ బిట్ స్మార్ట్ వాచ్ పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు.

Tags:    

Similar News