ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య... తెరపైకి షాకింగ్ రీజన్!
ఈ సమయంలో మేడ్చల్ ఏసీపీ రాములు ఆమె ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో మేడ్చల్ ఏసీపీ రాములు ఆమె ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు.
అవును... ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలపై మేడ్చల్ ఏసీపీ రాములు వివరించారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెలడించారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈమేరకు తమకు సమాచారం అందిందని అన్నారు. వెంటనే ఘటనా స్థలికి వేరుకున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా... గత కొంతకాలంగా రూపాదేవి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నారని.. ఈ నొప్పి ఆమెకు సుమారు మూడు సంవత్సరాలుగా ఉందని.. ఈ మెరకు పలు ఆస్పత్రిల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారని.. హోమియో మందులు కూడా వాడుతున్నారని.. అయినప్పటికీ ఆమె కడుపునొప్పి తగ్గలేదని అన్నారు. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారని ఏసీపీ రాములు తెలిపారు. అలా ఆమె రూపాదేవి ఆత్మహత్య చేసుకొవడానికి ముందు భర్త మేడిపల్లి సత్యంకు ఫోన్ చేశారని.. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నారని.. ఈ సమయంలో తన నొప్పిని భర్తకు ఆమె వివరించారని తెలిపారు. ఈ సమయంలో తాను వస్తున్నట్లు సత్యం చెప్పారని తెలిపారు.
ఇలా తన భర్తతో మాట్లాడిన తర్వాత బెడ్ రుం లోకి వెళ్లిన రూపాదేవి.. తలుపు గడియ పెట్టుకుని ఫ్యాన్ కు ఉరేసుకున్నారని.. ఎంతకూ బయటకి రాకపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు డోర్ బద్దలు కొట్టి ఆమె బాడీని కిందకు దించారని.. అనంతరం రెనోవ హాస్పటల్ కు తీసుకెళ్లారని.. అయితే ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారని ఏసీపీ వివరించారు.
ఇదే సమయంలో... ఆమె ఫోన్ ను వెరిఫై చేసినట్లు చెప్పిన ఏసీపీ.. భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అంతా కలిసే ఉంటున్నారని, రూపాదేవి ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆమె తల్లితోపాటు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారని ఏసీపీ తెలిపారు. ఆమె ఆత్మహత్యకు భరించలేని కడుపునొప్పే కారణం కన్ క్లూజన్ ఇచ్చారు!