నేను చెబితే చంద్రబాబు, పవన్ చెప్పినట్లే..

నేను చెబితే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లేననంటూ తేల్చిచెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి.

Update: 2024-12-23 17:30 GMT

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తాను చెప్పినట్లే పనులు జరగాలని, నేను చెబితే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లేననంటూ తేల్చిచెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి.

గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన డాక్టర్ పార్థసారథి అదోనిలో వైసీపీ కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ఐదు నెలలుగా మీకు సమయం ఇచ్చామని, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న వైసీపీ కార్యకర్తలు తక్షణం ఖాళీ చేసి కూటమి కార్యకర్తలకు ఆయా పనులు అప్పగించాలని హెచ్చరించారు. సోమవారం అదోనిలో కూటమి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలు ఆటలు సాగవని, తాము చెప్పినట్లు నడుచుకోవాలని వ్యాఖ్యానించారు.

మధ్యాహ్న భోజన పథకం, రేషన్ షాపులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ ఉద్యోగాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు తమ ఉద్యోగాలను స్వచ్ఛందంగా వదిలేయాలని చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి, తాను మంచిగా చెబుతున్నానని, వైసీపీ కార్యకర్తలు కూడా మంచిగా మర్యాదగా నడుచుకోవాలని వార్నింగిచ్చారు. కొంతమంది తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, తమను తొలగిస్తున్నట్లు లెటర్లు తెమ్మంటున్నారని చెప్పారు. నేను లెటర్లు తెచ్చి ఇవ్వడం కుదరదు. నేను చెప్పానంటే చంద్రబాబు చెప్పినట్లే.. నేను చెప్పానంటే పవన్ కల్యాణ్ ఆవేశంగా చెప్పినట్లేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎమ్మెల్యే ప్రకటించగానే కూటమి కార్యకర్తలు అదోనిలోని ఐదు రేషన్ షాపులకు తాళాలు వేశారు.

Tags:    

Similar News