కొత్తపల్లి గీతపై మళ్లీ చర్చ రీజనేంటి..!
కొత్తపల్లి గీత.. 2014 ఎన్నికల తర్వాత.. కొన్నాళ్ల పాటు చర్చనీయాంశం అయిన ఆమె.. హైదరాబాద్ భూ వివాదాల నేపథ్యంలో మరింత వివాదాస్పదం అయ్యారు. అయితే.. గత నాలుగేళ్లుగా చర్చల్లో కూడా లేని గీత ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ తెరమీదికి వచ్చారు.
కొత్తపల్లి గీత.. 2014 ఎన్నికల తర్వాత.. కొన్నాళ్ల పాటు చర్చనీయాంశం అయిన ఆమె.. హైదరాబాద్ భూ వివాదాల నేపథ్యంలో మరింత వివాదాస్పదం అయ్యారు. అయితే.. గత నాలుగేళ్లుగా చర్చల్లో కూడా లేని గీత ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ తెరమీదికి వచ్చారు. దీంతో కొత్తపల్లి గీతపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమెకు మళ్లీ దశ తిరగడం ఖాయమని కొందరు చెబుతున్నారు. మరికొందరు.. ఖచ్చితంగా ఆమెకు మంచి పొజిషన్ వస్తోందని కూడా అంటున్నారు.
2014 ఎన్నికల్లో అరకు నుంచి వైసీపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన గీత అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీ నుంచి బయటకు రావడంతో పాటు.. ఆమె.. టీడీపీలో చేరతారనే చర్చకు కూడా తెరదీసేలా వ్యవహరించారు. ఇక్కడ రికార్డ్ ఏంటంటే.. వైసీపీ తరఫున గెలిచిన ఎంపీల్లో ఒకరు.. గెలిచిన వెంటనే పార్టీ మారిపోయారు. మరొకరు..పార్టీ అధినేతకు మొహం చాటేశారు. దీని వెనుక ఏం జరిగిందనేది తెలియదు కానీ.. అనూహ్య మార్పు అయితే చోటు చేసుకుంది.
ఇలా.. గీత అప్పట్లోనే చర్చకు దారితీశారు. ఇక, 2019 ఎన్నికలకు ముందు కొత్త పార్టీ అంటూ హడావుడి చేశారు. అయితే.. అది సక్సెస్ కాలేదు. ఇంతలోనే హైదరాబాద్‌లో భూముల వ్యవహారం.. వివాదం.. అరె స్టుల వరకు సాగుతుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆమె గుట్టు చప్పుడు కాకుండా.. బీజేపీ పంచన చేరి పోయారు. కేసుల నుంచి బయటపడేందుకు మాత్రమే ఆయన బీజేపీ పంచన చేరారనే టాక్ వినిపించి నా.. ఏ రోజూ మీడియా ముందుకు రాలేదు.
కట్ చేస్తే.. కొత్తపల్లి అనూహ్యంగా వార్తల్లోకి రావడానికి దగ్గుబాటి పురందేశ్వరి రీజన్ అని అంటున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి ఇటీవల తొలిసారి విశాఖ వచ్చినప్పు డు.. అనూహ్యంగా కొత్తపల్లి గీతకు ప్రత్యేకంగా కబురు పెట్టి మరీ.. ఆమె తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. పార్టీ మహిళా మోర్చాలోనూ కొత్త పల్లి గీతకు ప్రాధాన్యం దక్కుతుందని అంటున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఊసే లేని నాయకురాలు.. ఒక్కసారిగా తెరమీదికి రావడం గమనార్హం.