నదిలో మునిగి.. నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి!
అవును... రష్యాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతంలోని ఓ నదిలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు కొట్టుకుపోయారు.
విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు సంబంధించిన విషాదకర ఘటనల పరంపర కొనసాగుతూనే ఉంది! ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ మేరకు ఎన్నో విషాదకర వార్తలు విన్న నేపథ్యంలో... తాజాగా మరో ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా నలువురు భారతీయ వైద్య విద్యార్థులు రష్యాలో మృతి చెందారు.
అవును... రష్యాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతంలోని ఓ నదిలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారని తెలుస్తుంది. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... సెయింట్ పీటర్స్ బర్గ్ లోని యూరోస్లోవ్ నోవోగొరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులు ఈ నెల 5న తమకు సమీపంలోని వోల్ఖోవ్ నది ఒడ్డున వాకింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో వారు నడుస్తుండగా.. ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో జారిపడింది.
దీంతో... ఆమెను కాపాడేందుకు నలుగురు విద్యార్థులు నదిలోకి దిగారు. ఆ ప్రయత్నంలోనే ముగ్గురు కొట్టుకుపోగా.. ఓ అమ్మాయిని మాత్రం స్థానికులు కాపాడారు. ఈ సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం తక్షణమే అక్కడ్దకు చేరుకుని సహాయక చర్చలు చేపట్టారు.
నదిలో గల్లైంతన విద్యార్థులను జీషన్ పింజారీ, జియా పింజారీ, మాలిక్ మహమ్మద్ యాకుబ్, హర్షల్ అనంత్ రావ్ లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. మరోపక్క ప్రమాదంలో బయటపడిన విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' ద్వారా తెలిపింది.