ఫ్యూచర్ టెస్లాదే... మస్క్ సైబర్ ట్రక్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్!
టెక్ దిగ్గజం ఆపిల్ ను కవర్ చేసే టాప్ ఎనలిస్టు మింగ్ చి కువో.. తాజాగా మస్క్ టెస్లా సైబర్ ట్రక్ పై ఈ మేరకు తన విశ్లేషణను వెళ్లడించారు.
ట్విటర్ (ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రానిక్ వాహనాల సంస్థ టెస్లా గురించి తెలిసిందే. ప్రస్తుతం పర్యావరణ హితమైన ఈ ఈవీ కార్లను అన్ని దేశాలూ ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ ప్రభుత్వం కూడా ఈవీ కార్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది! ఈ క్రమంలో మస్క్ టెస్లా కార్లపై విశ్లేషణ ఒకటి తాజాగా వైరల్ గా మారింది. దాని ప్రకారం... సైబర్ ట్రక్ 2024లో రికార్డ్ స్థాయిలో డెలివరీలు ఇవ్వబోతుందంట.
అవును... ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ కి సంబంధించిన ఎలక్ట్రానిక్ వాహనాల సంస్థ టెస్లాకు సంబంధించి తాజా విశ్లేషణ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దీనిప్రకారం... టెస్లాకు చెందిన ప్రతిష్టాత్మక ఆవిష్కరణ "సైబర్ ట్రక్" 2024లో దాదాపు 1,20,000 డెలివరీలు చేయనుందట. ఇక 2025 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంటున్నారు. ఈ మేరకు ఆపిల్ టాప్ విశ్లేషకుడు ఈ వివరాలు వెల్లడించారు.
టెక్ దిగ్గజం ఆపిల్ ను కవర్ చేసే టాప్ ఎనలిస్టు మింగ్ చి కువో.. తాజాగా మస్క్ టెస్లా సైబర్ ట్రక్ పై ఈ మేరకు తన విశ్లేషణను వెళ్లడించారు. ఇందులో భాగంగా బహుశా 2030 నాటికి ఆల్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కు సైబర్ ట్రక్ మార్కెట్లో గొప్ప పోటీ ఇవ్వనుందని తెలిపారు. ఈ స్థాయిలో టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు మింగ్ చి కువో నివేదించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈయన విశ్లేషణల ప్రకారం... టెస్లా సైబర్ ట్రక్, 2024లో ఒక లక్షా 20 వేల యూనిట్ల డెలివరీలను నమోదు చేయనుందట. ఇదే క్రమంలో 2025 లో 2,40,000 నుండి 2,60,000 డెలివరీలు చేస్తుందని అంటున్నారు. ఇక, ఈ ఏడాదిలోనే సైబర్ ట్రక్ షిప్ మెంట్ లు ప్రారంభమవుతాయని... అయితే అవి కేవలం 100-200 యూనిట్లు మాత్రమేనని తెలిపారు.
ఇదే సమయంలో... సైబర్ ట్రక్ కు కొనసాగింపుగా సైబర్ ట్రక్-2 కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. అదేవిధంగా... సైబర్ ట్రక్ వినూత్న డిజైన్ లు ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ వంటివి 2030 వరకు దాని పోటీ ప్రయోజనాన్ని కొనసాగిస్తుందని, అలాగే సైబర్ ట్రక్ 2.. 2030 నాటికి షిప్పింగ్ ను కూడా ప్రారంభించొచ్చని విశ్లేషిస్తున్నాడు. దీంతో ఈ విశ్లేషణ ఇప్పుడు వైరల్ అవుతుంది.