కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ మేయర్? అదే బాటలో ఇంకా కొందరు?

కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది

Update: 2024-03-22 09:13 GMT

కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు హస్తం గూటికి చేరాలని చూస్తున్నారు. మొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు ఎంపీ కూడా కాంగ్రెస్ లో చేరడంతో ఇంకా కొందరు నేతలు అదే వరసలో ఉన్నారని సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ లో ఉంటే ఎలాంటి ఫలితం లేదని తెలుసుకున్న నేతలు కాంగ్రెస్ లో చేరి కాస్తో కూస్తో సంపాదించుకోవాలని ఆశిస్తున్నారు. అందుకే పార్టీ మారడానికి మొగ్గు చూపుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంకా కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

శుక్రవారం ఉదయం విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి సమావేశం అయ్యారు. విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనేపథ్యంలో విజయలక్ష్మి పార్టీ మార్పుతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెబుతున్నారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురుని తమ పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నేతలను తమ పార్టీలో కలుపుకుంటోంది. అప్పుడు ఎదుర్కొన్న పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ కు శాపంగా మారుతోంది. నేతలంతా కాంగ్రెస్ లోకి క్యూ కట్టడంతో బీఆర్ఎస్ పరిస్థితి అధ్వానంగా మారింది.

ఇంకా పలువురు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. పార్టీ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతోనే బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం గందరగోళంలో పడనుంది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఉన్నా ఇప్పుడు అధికారం లేకపోవడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయి కాంగ్రెస్ పార్టీ కళకళలాడటం ఖాయంగా చెబుతున్నారు.

Tags:    

Similar News