దారుణం.. విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్!
జార్ఖండ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో తన భర్తతో కలిసి బైక్ పై టూరుకు వచ్చిన స్పెయిన్ పర్యాటకురాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది.
అతిథిని దైవంతో సమానంగా చూసే దేశం మనది. అందుకే ‘అతిథి దేవోభవ’ అంటారు. అలాంటి దేశంలో జరుగుతున్న అత్యాచారాలు కలకలం రేపుతున్నాయి. గతంలో పోర్చుగీస్, రష్యన్ యువతులపై మనదేశంలో జరిగిన అత్యాచారాలను మరిచిపోకముందే తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. భర్తతో కలిసి భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని వచ్చిన ఒక స్పెయిన్ యువతిని దుండగులు దారుణంగా అత్యాచారం చేశారు.
జార్ఖండ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో తన భర్తతో కలిసి బైక్ పై టూరుకు వచ్చిన స్పెయిన్ పర్యాటకురాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్పెయిన్ కు దంపతులు బైక్ పై మనదేశానికి వచ్చారు. ముందుగా బంగ్లాదేశ్ చేరుకున్నారు. అక్కడి నుంచి జార్ఖండ్ లోని దుమ్కాకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి బిహార్ మీదుగా నేపాల్ కు వెళ్లాలని అనుకున్నారు.
ఈ క్రమంలో జార్ఖండ్ లోని దుమ్కాకు చేరుకున్నారు. చీకటి పడడంతో నిర్జన ప్రదేశంలో రాత్రి బస కోసం దంపతులు డేరా ఏర్పాటు చేసుకున్నారు. వీరిని ఒంటరిగా గమనించిన 10 మంది దుండగులు భర్తపై దాడికి దిగారు. అతడిని గాయపరిచారు. ఆ తర్వాత స్పెయిన్ వివాహితపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.
ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. బాధితురాలికి ప్రస్తుతం దుమ్కాలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను ప్రశ్నిస్తున్నట్లు దుమ్కా ఎస్పీ వెల్లడించారు. టూరిస్టు వీసా మీద స్పెయిన్ దంపతులు భారత్ వచ్చినట్టు తెలిపారు. స్పానిష్ జంట మోటార్ బైక్ పై దుమ్కాలో పర్యటిస్తూ పలు ప్రదేశాలు సందర్శిస్తున్నారన్నారు. దుమ్కా సమీపంలోని కుంజి గ్రామంలో టెంట్లు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దుండగులు బాధితురాలిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని చెప్పారు.
మొత్తం ఆసియా ఖండంలో టూర్ కు ప్లాన్ చేసిన స్పానిష్ జంట తొలుత పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో తమ టూర్ పూర్తిచేసుకున్నారు. తర్వాత జార్ఖండ్ వచ్చారు. ఇక్కడి నుంచి నేపాల్ వెళ్లాలనేది వారి టూర్ ప్లాన్. ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకుంది.