గన్నవరం వైసీపీ సీటు... వంశీకి భారీ షాకేనా...?

ఇక గన్నవరం సీటు విషయంలో రాజకీయ కాక పెరగడానికి ఇంతలా చిచ్చు రేగడానికి కారణం వల్లభనేని వంశీ

Update: 2023-08-22 16:17 GMT

గన్నవరం సీటు. ఇపుడు ఏపీలో హాటెస్ట్ సీటుగా మారుతోంది. ఈ సీటు నుంచి ఎవరు పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో మాత్రం భీకరమైన ఫైటింగ్ జరగడం ఖాయం. ఇక గన్నవరం సీటు విషయంలో రాజకీయ కాక పెరగడానికి ఇంతలా చిచ్చు రేగడానికి కారణం వల్లభనేని వంశీ. రెండు సార్లు టీడీపీ నుంచి టికెట్ పొంది గెలిచిన వంశీ వైసీపీలోకి జంప్ చేయడంతోనే కధ మొత్తం అడ్డం తిరిగింది. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకటరావు 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి వంశీ మీద జస్ట్ 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆయనకు ఈసారి టికెట్ లేదు అన్న వార్తలతో టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇక వైసీపీ పుట్టిన దగ్గర నుంచి అందులో ఉన్న దుట్టా రామచంద్రరావు 2014లో పోటీ చేసి ఓడారు. ఆయన వైఎస్సార్ కి నమ్మిన బంటు. ఇక ఆయనకు 2019లో టికెట్ ఇవ్వకపోయినా పార్టీలోనే ఉన్నారు. ఇపుడు యార్లగడ్డ టీడీపీలోకి జంప్ చేసినా దుట్టా మాత్రం వైసీపీనే అట్టిపెట్టుకుని ఉన్నారు.

ఇక్కడే ఆయన జగన్ వద్ద మార్కులు కొట్టేశారు అని అంటున్నారు. గన్నవరంలో యార్లగడ్డ టీడీపీకి జంప్ చేయడంతో దుట్టాను జగన్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు అని అంటుననరు ఇక దుట్టా అయితే తన విధేయతకు తన సీనియారిటీకి టికెట్ ఈసారి ఇస్తే పోటీ చేస్తాను అని నేరుగా అధినేతను అడిగేసారు అని అంటున్న్నారు. పైగా వైఎస్సార్ సెంటిమెంట్ ని కూడా ఆయన వాడేశారు అని అంటున్నారు. వైఎస్సార్ కి నమ్మినబంటు అయిన దుట్టాను వదులుకోవడం ఇష్టం లేని జగన్ ఆయనకే టికెట్ అని హామీ ఇచ్చేశారు అని అంటున్నారు.

దాంతో తొందరలో శుభవార్త వింటారు అని దుట్టా తన అనుచరులకు చెప్పడంతో వారంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారట. మరో వైపు చూస్తే వంశీ మీద వైసీపీ అధినాయకత్వం గుర్రుగా ఉందిట. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అడ్డా లాంటి నున్న గ్రామపంచాయితీలోని 9వ వార్డు ఉప ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు, మాజీ ఎంపీటీసీ బొమ్మిన శ్రీనివాసరావు ఓటమిపాలయ్యారు. 25 ఓట్ల తేడాతో టీడీపీ బలపరిచిన వల్లూరు వెంకటశివ గెలుపొందారు.

ఇలా చూస్తే వైసీపీకి అడ్డాగా ఈ ప్రాంతంలో అధికార పార్టీ పరాజయం పాలవ్వడంతో టీడీపీ శ్రేణులు, యార్లగడ్డ వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. దీంతోనే వైసీపీ హై కమాండ్ మండిపోయిందట. ఒక పంచాయతీ వార్డు ఉప ఎన్నికలోనే పార్టీని గెలిపించలేకపోయారు అని పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందట. ఇపుడే ఇలా ఉంటే రేపటి రోజున 2024 ఎన్నికల్లో వైసీపీని ఎలా గెలిపిస్తారు అంటూ ఒక కొత్త డౌట్ ని వ్యక్తం చేస్తోందిట.

దీంతో పాటు ఇటీవల కాలంలో వంశీ అంత యాక్టివ్ గా లేకపోవడం వంటి పరిణామాలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ హై కమాండ్ అయితే ఆయన పట్ల సీరియస్ గా ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ పట్ల వీర విధేయతతో ఉన్న దుట్టా వైపే హై కమాండ్ మొగ్గు చూపుతోంది అని అంటున్నారు. దీంతో దుట్టా అనుచర వర్గం పండుగ చేసుకుంటున్నారుట. ఇక వంశీ తీరు చూస్తే అటు టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితి. మరో వైపు వైసీపీ హై కమాండ్ కూడా హ్యాండ్ ఇస్తే మాత్రం ఆయన రాజకీయం ఎటు తిరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి వంశీకి టికెట్ దక్కదు అన్నదే ప్రస్తుతం గన్నవరంలో హాట్ టాపిక్ గా ఉందిట. దుట్టా వర్గానికి ఇవ్వడం నూరు శాతం సమంజసం అని అంటున్నారుట.

Tags:    

Similar News