బాబుకు మాస్టర్ స్ట్రోక్ : వైసీపీలోకి గంటా...!?
టీడీపీ అధినేత చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ విశాఖ జిల్లాలో పొలిటికల్ గా తగలనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ విశాఖ జిల్లాలో పొలిటికల్ గా తగలనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి. విశాఖ జిల్లాలో అత్యంత బలీయమైన నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావుని టీడీపీ పట్టించుకోవడం లేదు. మొదటి జాబితాలో ఆయన పేరు లేదు. సొంత పార్టీలో గంటా ప్రత్యర్థిగా ఉన్న అయ్యన్నపాత్రుడుకు టికెట్ కన్ ఫర్మ్ చేసి మరీ గంటాను అలా వదిలేశారు.
ఇక గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లికి పంపించాలని చూస్తున్నారు. ఒక విధంగా గంటాను బలవంతంగా జిల్లాను దాటించి షిఫ్ట్ చేయడం అన్న మాట. ఈ ప్రతిపాదనకు ఆయన ఎటూ ఒప్పుకోరు అని తెలుసుకునే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. గంటా ఒక వేళ ఒప్పుకుంటే చీపురుపల్లి ఈ లెవెంత్ హవర్ లో వెళ్లి ఓటమి పాలు కావడం తప్ప చేసేది ఉండదు.
ఇక విధంగా ఆయన రాజకీయ జీవితాన్ని ఖతం చేసే ప్లాన్ ఇది అని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. మరో వైపు చూస్తే గంటా ఈసారి పోటీ చేయాలనుకుంటున్నది భీమిలీ, లేక చోడవరంగా ఉంది. ఈ రెండింటిలో కూడా గంటాకు సీటు వచ్చే చాన్స్ లేదు అని అంటున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ ని పొత్తు పేరుతో బీజేపీకి ఇస్తున్నారు.
ఇక భీమిలీని జనసేనకు ఇవ్వాలని చూస్తున్నారు. దాంతో పాటు చోడవరం సీటు కూడా గంటాకు ఇవ్వడం సాధ్యం కాదు అన్నది టీడీపీలో మాటగా ఉంది. ఈ క్రమంలో పోటీ చేస్తే చీపురుపల్లి మాత్రమే ఉంది అని అంటున్నారు. అయితే తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయను అని చంద్రబాబుని ఇటీవల కలసి చెప్పేసిన గంటా భీమిలీనే కోరుకున్నారు అని అంటున్నారు.
కానీ టీడీపీ హై కమాండ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అన్న గ్యారంటీ లేదు అంటున్నారు. ఈ క్రమంలో గంటా పార్టీ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది అని అంటున్నారు. గంటా పార్టీ మారాలీ అనుకుంటే వైసీపీయే ఆప్షన్ గా ఉంది. ఆయన 2019లో జగన్ వేవ్ ని తట్టుకుని గెలిచిన తరువాత కూడా వైసీపీ వైపు వెళ్ళాలని చూశారు. అప్పట్లో అది సాధ్యపడలేదు.
ఇపుడు మాత్రం సాధ్యమే అంటున్నారు. దానికి కారణం అటు వైసీపీ రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయని అంటున్నారు. విశాఖలో టీడీపీ బలంగా ఉంది. దాంతో ఆ పార్టీకి చెక్ పెట్టాలంటే గంటా అవసరం ఉంది అని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారుట. అదే టైం లో తన రాజకీయ భవిష్యత్తు కోసం గంటా పార్టీ మారాలని చూస్తున్నారు అని తెలుస్తోంది.
పాతికేళ్ళుగా రాజకీయం చేస్తూ వచ్చిన గంటాకు ఈసారి ఎన్నికలు చివరికి అని అంటున్నారు. ఈసారి గెలిచి తన కుమారుడిని రాజకీయ వారసుడిగా 2029 ఎన్నికల్లో తీసుకుని రావాలని గంటా చూస్తున్నారు. అందుకే ఆయన విశాఖలో సేఫ్ సీటు కోసం చూస్తున్నారు. అది తన కుమారుడికి కూడా ఇవ్వాలన్నది గంటా ఆలోచనగా ఉంది. దాంతో ఆయనకు టీడీపీ హ్యాండ్ ఇస్తే గంటా వైసీపీలోకి జంప్ అవుతారు అని అంటున్నారు.
ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు పూర్తి అయ్యాయని ప్రచారం సాగుతోంది. ఇక గంటా భీమిలీ టికెట్ ఆశిస్తున్నారు అని అంటున్నారు. ఆ టికెట్ ఇచ్చేందుకు వైసీపీకి అభ్యంతరంలేదు అని అంటున్నారు. అక్కడ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. టీడీపీ జనసేనలను భీమిలీలో ఢీ కొట్టి గెలవాలంటే గంటా సరైన నేత అనుకుంటే కచ్చితంగా ఆ పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుంది అని అంటున్నారు. అవంతికి హామీ ఇచ్చి సర్ది చెబుతారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే గంటా రేపో మాపో వచ్చే టీడీపీ జాబితా చూసిన తరువాత తన డెసిషన్ వెల్లడిస్తారు అని అంటున్నారు.
తనను పార్టీ పక్కన పెడితే తాను కూడా సరైన జవాబు చెప్పాలన్న పట్టుదల ఆయనలో ఉందని అంటున్నారు. గంటా అంగబలం అర్ధబలం తమకు ఉపకరిస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.