గంటా రాజీనామా విషయంలో లాజిక్ లాగిన స్పీకర్!

తాజాగా ఈ విషయాలపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం... గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంలో రాజకీయ కుట్ర ఏముందని ప్రశ్నించారు.

Update: 2024-01-25 08:28 GMT

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రెవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి స్పీకరు ఫార్మాట్ లో చాలకాలం కిందట రాజీనామా చేశారు టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు. అది కాస్తా ఇప్పుడు ఆమోదం పొందింది. దీంతో.. గంటా హఠాత్తుగా "మాజీ" అయిపోయారు. దీంతో... ఎప్పుడో రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా? ఇందులో రాజకీయ కుట్ర ఉంది అనే కామెంట్లు తెరపైకి వచ్చాయి! దీంతో ఈ విషయాలపై స్పీకర్ తమ్మినేని సూటిగా, స్పష్టంగా స్పందించారు.

అవును... ఎమ్మెల్యే పదవికి స్పీకరు ఫార్మాట్ లో చాలా కిందట రాజీనామాను గంటా శ్రీనివాస రావు సమర్పించగా.. ఇంతకాలం వేచి చూసిన తమ్మినేని తాజాగా ఆ రాజినామాను ఆమోదించారు. దీంతో... ఇందులో రాజకీయ కోణం ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే తన రాజినామాను ఇప్పుడు ఆమోదించారని అంటున్నారు. వాస్తవానికి.. స్పీకరు ఫార్మాట్ లో రాజీనామా చేసిన తర్వాత.. స్పీకరు దానిని ఎప్పుడైనా ఆమోదించవచ్చు.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం... గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంలో రాజకీయ కుట్ర ఏముందని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ గంటా శ్రీనివాస్... తనకు ఎప్పుడో లేఖ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా తమ్మినేని గుర్తు చేశారు. అయితే మానవతా థృక్ఫథంతో ఈ విషయమై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదని, అయితే సమయం ముగిసిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే రాజీనామాను ఆమోదించినట్లు చెప్పడం సరైంది కాదని చెప్పిన తమ్మినేని... రాజ్యసభ ఎన్నికల కోసమే అయితే అందరినీ ఎందుకు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా... టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీకి దగ్గరగా ఉంటున్న వంశీ, వాసుపల్లి గణేష్, మద్దల గిరి మొదలైన వారిపై కూడా చర్యలు ఉంటున్నాయని స్పష్టం చేశారు. అంటే.. తన నిర్ణయానికి టీడీపీ, వైసీపీ అనే తేడాలు లేవని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారన్నమాట.

ఇక ఈ విషయంపై గంటా శ్రీనివాస్ న్యాయపోరాటం చేయాలనుకుంటే చేఉకోవచ్చని.. తనకున్న హక్కులను ఆయన వినియోగించుకోవచ్చని తమ్మినేన్ని సున్నితంగా స్పందించారు. స్మూత్ గా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కాగా... విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గంటా శ్రీనివాస్ రావు మూడెళ్ల కిందటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్ ఫార్మెట్ లో ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే... తీరా ఆ రాజీనామాను ఆమోదించే సరికి ఇలా యాగీ చేస్తున్నారు. దీంతో... ఆమొదించరులే అనే ఉద్దేశ్యంతో నాడు రాజీనామా చేశారా.. ఆ రాజినామాలో చిత్తశుద్ధి లేదా అనే కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి!!


Tags:    

Similar News