భారత ఆర్థికవ్యవస్థ భవిష్యత్తుపై ఆసక్తికరవ్యాఖ్యలు... ఎవరీ గీతా గోపీనాథ్?

భారతదేశం ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి చెందుతోంది.. 2027 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది

Update: 2024-08-17 01:30 GMT

భారతదేశం ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి చెందుతోంది.. 2027 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అంచనాలకంటే మెరుగైన అభివృద్ధి సాధించింది.. అయితే... ఈ వృద్ధి వేగానికి వేరు వేరు కారణాలు ఉన్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గీతా గోపీనాథ్.

అవును... భారత్ ఆర్థికంగా అంచలానకు మించి వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇదే కొనసాగితే 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ.ఎం.ఎఫ్) ఫస్ట్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. ఆమె తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో భారత్ వృద్ధి వేగానికి వేర్వేరు కారణాలున్నాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకంటే భారత్ మెరుగైన వృద్ధి రేటును నమోదు చేసిందని.. దాన్ని కంటీన్యూ చేసేందుకు తీసుకునే చర్యలు ఈ ఏడాది తమ అంచనాలను ప్రభావితం చేశాయని గీత వెల్లడించారు.

ఇదే క్రమంలో... గత ఏడాది ప్రైవేటు వ్యయాల వృద్ధి 4 శాతం మాత్రమే ఉందని.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు పెరిగే కొద్దీ ఇది కూడా ఇంకా వృద్ధి చెందుతుందని.. టూవీలర్ అమ్మకాలు, ఎఫ్.ఎం.సీ.జీ. విక్రయాలు బాగా పుంజుకున్నాయని అన్నారు. వీటికి తోడు వర్షాలు కూడా బాగా కురవడంతో మంచి పంట ఉత్పత్తి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ఎప్పుడైతే పంట ఉత్పత్తి పెరిగిందో.. తదనుగుణంగా వ్యవసాయ ఆదాయం పెరిగి గ్రామీణ వినిమయం పుంజుకోంటుందని.. తమ అంచనాలకు మూలాలు ఇవే అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ.ఎం.ఎఫ్) ఫస్ట్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ వెల్లడించారు.

కాగా... భారత్ లో టూవీలర్ విక్రయాలు పెరగడంతో పాటు అనుకూలమైన వర్షాలు పడటంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధిరేటు అంచనాలను 7శాతానికి పెంచింది ఐఎంఎఫ్. మరోపక్క ఈ ఏడాది ఆర్థిక సర్వేలో ప్రభుత్వం ఇచ్చిన 6.5శాతం కంటే ఐ.ఎం.ఎఫ్ అంచనాలు అధికంగా ఉండటం గమనార్హం.. ఇది శుభసూచకం!

Tags:    

Similar News