ప్రజల 'పన్ను' పీకే దేశాలివే.. ఇందులో మన భారత్..?

మన నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్మను గద్దలా ఎత్తుకెళ్తున్నారన్న ఆవేదన తన్నుకొస్తుంది కదా..?

Update: 2025-01-28 22:30 GMT

మీకు నెలకు లక్ష రూపాయిలు వస్తున్నాయనుకుందాం.. ఇందులోంచి 40 వేల రూపాయిలు ప్రభుత్వం ఆదాయ పన్ను కింద లాక్కుంటే.. ఎలా ఉంటుంది..? మన నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్మను గద్దలా ఎత్తుకెళ్తున్నారన్న ఆవేదన తన్నుకొస్తుంది కదా..?

అదే.. మీరెంత సంపాదించినా అసలు మీకు ఆదాయపు పన్ను లేదు అని చెప్పారనుకోండి..? వినడానికే కాదు.. మళ్లీ మళ్లీ చదవడానికీ ఎంతో బాగుంటుంది కదా..?

ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే చేస్తున్నారు. ‘‘మీకు ఆదాయ పన్ను లేదు పో’’ అంటూ ప్రకటించారు. ఇది ఎంతవరకు అమలవుతుందో చెప్పలేం కానీ.. అమెరికా వంటి అగ్ర రాజ్యంలో ఆదాయ పన్ను విధించడం లేదంటే అది ప్రపంచ వింతనే అనుకోవాలి.

కొన్ని దేశాల్లో అసలు ఆదాయ పన్ను అనేదే లేదు. అయితే, ఈ దేశాలన్నీ చాలా చిన్నవి. అక్కడ ఏం జరిగినా పెద్దగా పట్టించుకోరు. మరికొన్ని దేశాల్లో మాత్రం ఆదాయపు పన్ను బాదుడే బాదుడు.

సగం సంపాదన వాటికే..

ఐవరీకోస్ట్ (60శాతం), ఫిన్లాండ్ (56.95), డెన్మార్క్ (55.9), జపాన్ (55.97), ఆస్ట్రియా (55), స్వీడన్ (52.3), అరుబా (52), బెల్జియం (50), ఇజ్రాయెల్ (50), స్లొవేనియా (50), నెదర్లాండ్స్ (49.5), పోర్చుగల్ (48), స్పెయిన్ (47), ఆస్ట్రేలియా (45), చైనా (45), ఫ్రాన్స్ (45), జర్మనీ (45), దక్షిణాఫ్రికా (45), ఐస్ ల్యాండ్ (46.9), నార్వే (44.7) దేశాల్లో ఆదాయపు పన్ను బాదుడు అధికం. వీటిలో అత్యధికం యూరప్ దేశాలే కావడం విశేషం.

మరి మన దగ్గర..?

భారత్ లో ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. మన దేశంలో ఈసారి రూ.పది లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పటివరకు రూ.7.5 లక్షల వరకు పన్ను లేదు. అధిక ఆదాయ వర్గాలకు 38 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. కాగా, దేశ ఆదాయ పన్ను విధానంలో ఈసారి 25 శాతం శ్లాబ్ ప్రవేశపెట్టే యోచన ఉందని సమాచారం.

Tags:    

Similar News