మీ ఇల్లే కాదు .. మీ ఒళ్లూ బంగారమే !
రోజు రేజుకూ బంగారం ధర మండిపోతున్న నేపథ్యంలో మీ శరీరంలో బంగారం ఉంటుందన్న వార్త ఆశ్చర్యానికి గురిచేస్తుందా.
మీరు 70 కిలోల బరువు ఉన్నారా ? అయితే మీ ఒంట్లో 0.2 మిల్లీ గ్రాముల బంగారం కూడా ఉంటుంది. ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే. మన శరీర నిర్మాణంలో ఉండే అనేక మూలకాలలో బంగారం కూడా ఉంటుంది.
ప్రకృతిలో ఉండే 118 మూలకాల్లో మన శరీరంలో ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్. ఈ నాలుగింటితోనే మానవ శరీరం నిర్మాణమవుతుంది. వీటన్నింటికి తోడుగా ఇందులో బంగారం కూడా కొద్దిగా ఉంటుంది.
శరీర బరువులో ఈ నాలుగు మూలకాలు 97 శాతం ఆక్రమిస్తాయి. అందులో ఒక్క ఆక్సిజన్ బరువు సగానికి పైగా ఉండడం గమనార్హం.
శరీరంలోని మూలకాలలో సోడియం పాత్ర కీలకం. అది శరీరంలో కొంచెం తగ్గినా, కొంచెం పెరిగినా శరీరానికి ముప్పే. సగటు వయోజన శరీరంలో 40-60 గ్రాముల సోడియం ఉంటుంది, ఇది రక్తంలో 100-150 mmol/L సోడియంకు సమానం. రోజు రేజుకూ బంగారం ధర మండిపోతున్న నేపథ్యంలో మీ శరీరంలో బంగారం ఉంటుందన్న వార్త ఆశ్చర్యానికి గురిచేస్తుందా.