గ్రీన్ కార్డుకు ఆల్టర్‌నేటివ్.. అమెరికా నిర్ణయం భారతీయులకు ఊరట!
అమెరికాలో శాశ్వత నివాసహక్కు పొందాలనుకునేవారికి ఇటీవల అక్కడి అధికారులు వెల్లడించిన అంశా లు శరాఘాతంగా మారాయి.
అమెరికాలో శాశ్వత నివాసహక్కు పొందాలనుకునేవారికి ఇటీవల అక్కడి అధికారులు వెల్లడించిన అంశా లు శరాఘాతంగా మారాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, 2024 సంవత్సరానికిగాను పూర్తిగా కోటా నిండిపోయిందని కూడా వెల్లడించారు. దీంతో అమెరికా లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న భారతీయ పౌరులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.
ఈ క్రమంలో తాజాగా అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థిర నివాసం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు చల్లని కబురు అందించారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా.. చేసుకోకపోయినా.. అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేసుకునేవారికి కొత్తగా ఎప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డు(ఈఏడీ)ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు అక్కడి అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇది గ్రీన్ కార్డుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని వివరించారు.
ఈ విధానం ప్రస్తుతం చర్చల ప్రక్రియలో ఉందని.. దీనికి తుది రూపు వచ్చి, అగ్రరాజ్యం అధ్యక్షుడు ఓకే చెబితే.. అమల్లోకి తీసుకువస్తామని వైట్ హౌస్ కమిషనర్ వెల్లడించారు. అంతేకాదు.. ఇది గ్రీన్ కార్డు మాదిరిగానే ప్రయోజనాలు అందిస్తుందని తెలిపారు. అయితే, శాశ్వత నివాసం కాబోదని.. ఈ కార్డును ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. కానీ, అభ్యంతరాలు ఉండవని తెలిపారు.
ఇదిలావుంటే.. శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయులకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డు ప్రయోజనకరంగా ఉంటుందని పలు ట్రావెల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గ్రీన్ కార్డుకు ఆల్టర్‌నేటివ్‌గా ఇది ఉంటుందని,దీనివల్ల ఉద్యోగులు అక్కడ ఉండేందుకు సౌలభ్యం ఏర్పడుతుందని వివరించారు.