కేంద్రం : ఏపీకి ఫస్ట్ గుడ్ న్యూస్ !

ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త వినిపించింది.. రాష్ట్రం లోని గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Update: 2024-06-18 14:57 GMT

ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త వినిపించింది.. రాష్ట్రం లోని గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ రైల్వే లైన్ నిర్మించ బోతున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 83.17 కిలో మీటర్ల దూరం ఉంది.

నిర్మాణంలో భాగంగా 36.5 హెక్టార్ల భూమిని సేకరించ బోతున్నారు. ఈ లైను అందుబాటు లోకి వస్తే తిరుపతి వెళ్లే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన పార్టీలది కీలకపాత్ర. కేంద్రంలో ప్రభుత్వం మనుగడ సాగించాలంటే టీడీపీ, జనసేన మద్దతు తప్పనిసరి అయిన నేపథ్యంలో ఏపీ ప్రయోజనాలు దక్కించుకోవడానికి మంచి అవకాశం ఈసారి దక్కిన నేపథ్యంలో కేంద్రం నుండి ఏపీ ప్రజలకు తొలి శుభవార్త అందిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News