ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అనుమతి.. ఆ రాష్ట్ర సీఎం కొత్త ఆలోచన

తాజాగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అనుమతి ని తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన పై కసరత్తు చేస్తున్నట్లుగా చెప్పారు.

Update: 2023-08-01 04:34 GMT

కాలం మారింది. అందుకు తగ్గట్లే పెళ్లిళ్ల విషయంలోనూ మార్పులు వస్తున్నాయి. గతం తో పోలిస్తే ప్రేమ పెళ్లిళ్ల సంఖ్య పెరిగింది. అయితే.. ఈ లవ్ మ్యారేజ్ విషయాల్ని పెద్దగా పట్టించుకోని ముఖ్యమంత్రుల కు భిన్నంగా తాజాగా గుజరాత్ రాష్ట్ర సీఎం కీలక ప్రకటన చేశారు.

ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అనుమతి తప్పనిసరి చేసేందుకు వీలుగా సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నట్లుగా చెప్పి కొత్త కలకలానికి తెర తీశారు. గుజరాత్ లో బీజేపీ సర్కారు అధికారం లో ఉన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రానికి మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆ స్టేట్ లో కంటిన్యూగా బీజేపీనే అధికారం లో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అనుమతి ని తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన పై కసరత్తు చేస్తున్నట్లుగా చెప్పారు. "ప్రేమ పెళ్లిళ్ల విషయం లో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉంటే ఎలా ఉంటుంది? ఈ అంశం పై మా ప్రభుత్వం అధ్యయనం చేయాలనుకుంటోంది. రాజ్యాంగబద్ధంగా అది సాధ్యమవుతుందా? ఆ కోణం లో పరిశీలించాకే ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. పటీదార్ లాంటి కమ్యూనిటీల నుంచి ఈ తరహా డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి" అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యల పై రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రుషికేష్ పటేల్ మరో సలహా ఇచ్చారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకునే ఘటనల పై అధ్యయనం చేయాలని.. వాటి ఆధారంగా ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అంగీకారం ఉండేలా విధివిధానాల్ని రూపొందించాలన్న సూచన చేశారు.

మొత్తానికి ప్రేమికుల కు కరెంటు షాక్ తగిలేలా మారిన ఈ వ్యాఖ్యల పై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక నిర్ణీత వయసు వచ్చిన తర్వాత ఎవరి ని పెళ్లిళ్లు చేసుకోవా లో తమకు తెలుసన్న మాట పలువురి నోట వింటున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఈ విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్న ఆలోచన ను తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ప్రతిపాదన పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా సైతం మద్దతు పలుకుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్ల విషయం లో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేయాలని భావిస్తుందని.. అలా చేస్తే తన మద్దతు కూడా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. మరి.. ఈ వ్యాఖ్యల పర్యవసానాలు ఏ రీతి లో ఉంటాయన్నదిప్పుడు ప్రశ్నగా మారాయి.

Tags:    

Similar News