యూఎస్ లో గన్ బాధితులు... అబ్రహాం లింకన్ నుంచి ట్రంప్ వరకూ...!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు ఘటన షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు ఘటన షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. ట్రంప్ పై పక్కా ప్లానింగ్ ప్రకారమే దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులు సూచిస్తున్నాయని అంటున్నారు. ముష్కరుడు దాడి చేయడానికి నక్కిన ఇంటిపైకి ఎక్కేందుకు అక్కడ నిచ్చెన ఉందని చెబుతున్నారు.
ఇదే సమయంలో... ట్రంప్ వచ్చే సమయానికి అతడు పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని అంతున్నారు. పైగా... అతడు గన్ పొజిషన్ తీసుకున్నట్లు చెబుతున్న ప్రదేశం నుంచి.. సభాస్థలి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సంగతి అలా ఉంటే... అమెరికాలో అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై దాడులు జరగడం కొత్తేమీ కాదు!
అవును... సుమారు 9 మంది అమెరికా ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ తుపాకీ బాధితులుగా ఉన్నారు. ఇందులో... అబ్రహం లింకన్, జేమ్స్ గార్ఫీల్డ్, విలియం మెకిన్లీ హత్యలు చివరికి సీక్రెట్ సర్వీస్ రక్షణకు దారితీయగా... జాన్ ఎఫ్. కెన్నెడీ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫలితంగా అధ్యక్షుడి చుట్టూ మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పడింది.
అయినప్పటికీ... గెరాల్డ్ ఫోర్డ్ 18 రోజుల వ్యవధిలో రెండు సార్లు యాటాక్ కి గురవ్వగా... రొనాల్డ్ రీగన్ 1981లో అధ్యక్షుడిగా ఉన్న తొలినాళ్లలోనే ఒక ముష్కరుడి బుల్లెట్ తో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ జాబితాలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్స్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం...!
జేమ్స్ గార్ఫీల్డ్:
జూలై 2, 1881న వాషింగ్టన్ లో గార్ఫీల్డ్ కాల్పుల బరిన పడ్డాడు. చికిత్స పొందుతూ రెండు నెలల తర్వాత గాయాల కారణంగా మరణించాడు. రచయిత, న్యాయవాది చార్లెస్ గిటో.. ఈ నేరానికి పాల్పడ్డాడు. అతడికి మరణశిక్ష విధించరు.
అబ్రహం లింకన్:
ఏప్రిల్ 14, 1865న సుప్రసిద్ధ నటుడు, కాన్ఫెడరేట్ సానుభూతిపరుడైన జాన్ విల్కేస్ బూత్.. లింకన్ ను వాషింగ్టన్ లో కాల్చి చంపాడు.
విలియం మెకిన్లీ:
సెప్టెంబరు 6, 1901న న్యూయార్క్ లోని బఫెలోలో మెకిన్లీ కాల్చి చంపబడ్డాడు. ఈయనపై అరాచకవాది లియోన్ క్జోల్గోస్జ్ హత్యకు పాల్పడ్డాడు. అనంతరం అతడికి మరణశిక్ష విధించారు.
థియోడర్ రూజ్ వెల్ట్:
అక్టోబరు 14, 1912న మిల్వాకీలో ప్రసంగిస్తుండగా రూజ్ వెల్ట్ కాల్చి చంపబడ్డారు.
జాన్ ఎఫ్ కెన్నెడీ:
నవంబర్ 22, 1963న టెక్సాస్ లోని డల్లాస్ లో లీ హార్వే ఓస్వాల్డ్.. అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీని కాల్చి చంపాడు.
రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ:
జూన్ 5, 1968 అర్ధరాత్రి తర్వాత.. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లోని అంబాసిడర్ హోటల్ లో ప్రసంగించిన తర్వాత అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీపై మూడుసార్లు కాల్పులు జరిగాయి. ఈ సమయంలో చికిత్స పొందుతూ... 26 గంటల తర్వాత మరణించాడు. రాబర్ట్ కెన్నెడీ హత్య.. ప్రధాన అధ్యక్ష అభ్యర్థులందరికీ రహస్య సేవా రక్షణకు దారితీసింది.
గెరాల్డ్ ఫోర్డ్:
సెప్టెంబర్ 5, 1975న కల్ట్ లీడర్ చార్లెస్ మాన్సన్ అనుచరుడైన లినెట్ “స్క్వీకీ” ఫ్రోమ్.. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఫోర్డ్ ను కాల్చడానికి ప్రయత్నించాడు. అనంతరం... మూడు వారాల తర్వాత సారా జేన్ మూర్ శాన్ ఫ్రాన్సిస్కోలో.. మరోసారి ఫోర్డ్ పై ఇద్దరు మహిళలు కాల్పులు జరిపారు.
రోనాల్డ్ రీగన్:
మార్చి 30, 1981న... జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి వాషింగ్టన్ లో నాటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై ఆరుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అధ్యక్షుడు తీవ్రంగా గాయపడినప్పటికీ... అత్యవసర శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నారు. ఈ ఘటనలో... హింక్లీని వెంటనే అరెస్టు చేసి, రీగన్ మరణించిన 12 సంవత్సరాల తర్వాత 2016 వరకు సంస్థాగత మానసిక సంరక్షణలో ఉంచారు.
డోనాల్డ్ ట్రంప్:
ట్రంప్ 2016 ఎన్నికల ప్రచార సమయంలో.. 20 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తి ట్రంప్ ర్యాలీలో ఉన్న లాస్ వెగాస్ పోలీసు అధికారి నుండి తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించాడు. అనంతరం... ట్రంప్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అతడు పోలీసులకు చెప్పాడు. నేరాన్ని అంగీకరించాడు.