హల్దీరామ్స్ ను సొంతం చేసుకోవటానికి భారీ స్కీం

ఇందులో భాగంగా భారీ మొత్తంలో ఆఫర్ ఇస్తున్న వైనం మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Update: 2024-08-16 11:30 GMT

దేశీయ స్నాక్స్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే హల్దీరామ్స్ ను సొంతం చేసుకోవటానికి అంతర్జాతీయ సంస్థలు కన్నేశాయి. భారీ ఆఫర్ ఇచ్చి ఆ సంస్థను సొంతం చేసుకోవటం ద్వారా భారత స్నాక్స్ మార్కెట్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించాలని తపిస్తున్నాయి. ఇందులో భాగంగా భారీ మొత్తంలో ఆఫర్ ఇస్తున్న వైనం మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా హల్దీరామ్స్ గురించి తెలియని వారు లేరు. బ్రాండెడ్ స్నాక్స్ మార్కెట్ లో దేశీయ రుచులతో ఉండే హల్దీరామ్స్ కు తిరుగులేని అధిక్యత ఉంది. ఉత్తరాది మొదలు దక్షిణాది రుచులను అందించే ఈ సంస్థ ఉత్పత్తులు దేశ ప్రజలకు సుపరిచితమే కాదు.. నమ్మకం కూడా ఎక్కువే. రూ.5 పాకెట్ నుంచి ఈ కంపెనీ ఉత్పత్తులు లభిస్తుంటాయి. ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోకకుండా ప్రతి అవకాశాన్ని సొంతం చేసుకోవటానికి అవసరమైన శక్తియుక్తుల్నిప్రదర్శించే ఈ సంస్థ విలువను లెక్క కట్టిన అంతర్జాతీయ దిగ్గజాలు.. ఫ్యాన్సీ అమౌంట్ నుఆఫర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

2023-24లో హల్దీరామ్స్ కంపెనీ అమ్మకాలు 18 శాతం పెరిగి రూ.12,161 కోట్లు ఉండగా.. తాజాగా మార్కెట్ వాటాలో 25 శాతం ఈ కంపెనీదే. అంతకంతకూ విస్తరిస్తున్న స్నాక్స్ మార్కెట్ లో తిరుగులేని రారాజుగా అవతరించేందుకు వీలుగా హల్దీరామ్స్ ను సొంతం చేసుకునే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఈ సంస్థను సొంతం చేసుకోవటానికి అమెరికా ప్రైవేటు ఈక్విటీ దిగ్గజం బ్లాక్ స్టోనో రంగంలోకి దిగినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సంస్థలో 51 శాత వాటా కోసం బ్లాక్ స్టోన్ రూ.40వేల కోట్లు ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. వారి అంచనాల ప్రకారంహల్దీరామ్స్ విలువను రూ.70 నుంచి రూ.80వేల కోట్ల వరకు లెక్క కట్టినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ డీల్ కు హల్దీరామ్స్ ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News