తాడేపల్లిగూడెం సభలో తేలాల్సిందే... 29 తర్వాత కథే వేరంటున్న జోగయ్య!

టీడీపీ - జనసేన పొత్తు.. ఈ సందర్భంగా ప్రధాన అంశమైన సీట్ల సర్దుబాట్లకు సంబంధించి మాజీ మంత్రి, కాపు నేత హరిరామ జోగయ్య రాసిన లేఖలు

Update: 2024-02-27 09:26 GMT

టీడీపీ - జనసేన పొత్తు.. ఈ సందర్భంగా ప్రధాన అంశమైన సీట్ల సర్దుబాట్లకు సంబంధించి మాజీ మంత్రి, కాపు నేత హరిరామ జోగయ్య రాసిన లేఖలు, వాటిద్వారా చేసిన సూచనలు అన్నీ ఇన్నీ కాదు. ఇందులో భాగంగా... పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలి వంటి సూచనలతో ఇన్ని రోజులూ లేఖర్లు రాసిన జోగయ్యకు ఇంక ఆ ఛాన్స్ పోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పదవులపై పడ్డారు జోగయ్య!

అవును... పొత్తులో భాగంగా జనసేన తీసుకోవాల్సిన సీట్లు ఎన్ని, అవి ఎక్కడెక్కడ, పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి అనువైన నియోజకవర్గాలేమిటి... ఇలా జనసేనకు అనధికారిక సలహాదారుగా, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన హరిరామ జోగయ్యకు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు! ఇప్పటికే 175లోనూ పొత్తులో భాగంగా 24 సీట్లకు పవన్ తలాడించేశారు. దీంతో... సీట్ల టాపిక్ పక్కన పెట్టి, పదవుల టాపిక్ ఎత్తుకున్నారు జోగయ్య.

ఈ క్రమంలో తాజాగా ఒక లేఖ సంధించారు. ఇందులో భాగంగా... కాపులు భాగస్వాములుగ ఉన్న బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలని.. ఆనాడే వారి వారి భవిష్యత్తుకు ఒక దారి ఏర్పడుతుందని నమ్మి... దాన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టిన మాట వాస్తవమని.. ఈ ప్రయత్నంలో పవన్ పెద్దన్నపాత్ర వహించడం ఎద్వార బానిస సంకెళను బద్దలు కోట్టొచ్చని భావించిన మాట వాస్తవమని లేఖలో పేర్కొన్నారు జోగయ్య!

ఈ సమయంలో మొదటి ప్రయత్నంగా టీడీపీని కలుపుకుని మొదటి దశలో భూస్వామ్య అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలలో ఒకరైన వైసీపీ అధినేత జగన్ పాలను అంతం పలకాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకొచ్చారు! ఈ క్రమంలో బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం... అధికారాన్ని పంచుకోవడంలో పవన్ కల్యాణ్, చంద్రబాబుల పాత్రం ఏమిటో తేల్చాలని, అది తేలకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని జోగయ్య తాజాగా రాసిన లేఖలో స్పష్టం చేశారు.

అయితే బడుగు బలహీనవర్గాలు ఆశిస్తున్న ప్రకారం.. అధికారాన్ని పంచుకోవటంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్ర ఏమిటో తేల్చాలని.. అది తేలకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ప్రధానంగా అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలని, గౌరవపదమైన హోదాలో పవన్ పదవి దక్కించుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తన నిర్ణయాన్ని ఈ నెల 29న ప్రకటిస్తానని జోగయ్య స్పష్టం చేశారు.

కాగా... ఈ నెల 28న తాడేపల్లి గుడెం వేదికగా "జెండా" పేరుతో టీడీపీ - జనసేన ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు ఏ విధంగా ఉమ్మడిగా ముందుకు వెళ్లాలనే విషయంపై చంద్రబాబు, పవన్ లు దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే లేఖ రాసిన జోగయ్య... ఈ జెండా సభలో తేల్చాసిన విషయాలను ప్రస్థావిస్తూ.. తేల్చకపోతే ఏమిచేస్తారో 29న చెబుతానని అన్నారు!

Tags:    

Similar News