కోమటిరెడ్డికి హరీష్ కొత్తసవాల్ !
లోక్ సభ ఎన్నికల్లో ఈ సవాల్ హాట్ హాట్ గా నడిచింది.
ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ సవాల్ హాట్ హాట్ గా నడిచింది.
ఈ నేపథ్యంలో తాజాగా హరీష్ రావు విదేశీ పర్యటనకు వెళ్లారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న అధికారి ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే ఇబ్బందుల్లో పడతామని హరీష్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని కలిశాడని ఆరోపించాడు.
దీనిపై హరీష్ రావు తీవ్రంగా స్పందించాడు. ‘కోమటిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మతిభ్రమించినట్టుగా అనిపిస్తున్నది. వెంటనే వెళ్లి డాక్టర్ కు చూపించుకుంటే మంచిది. నేను ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే హైదరాబాదులో అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకేసి రాస్తాను. తన ఆరోపణలు నిరూపించుకోకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ అంశంపై ఎక్కడ చర్చించేందుకైనా నేను సిద్ధంగా ఉన్నాను. అమెరికాలో ఎక్కడికి వెళ్లాను, ఏ హోటల్ లే దిగాను? అనే వివరాలతో పాటు పాస్ పోర్టు స్టాంపింగ్ వివరాలతో సహా నేను చర్చకు వస్తాను. మంత్రి కోమటిరెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలతో చర్చకు రావాలి? టైమ్, డేట్ కోమటిరెడ్డి చెప్పాలి" అని హరీశ్ రావు సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ ఎక్కడికి వెళ్తుందో వేచిచూడాలి.