5 ఏళ్లలో ఫారిన్ లో మన విద్యార్థులు ఎంతమంది ప్రాణాలు పోయాయంటే?

విదేశాల్లో ఉన్నతచదువుల కోసం వెళుతున్న విద్యార్థులు ఇలా అనుమానాస్పద రీతిలో మరణిస్తున్న వైనం మిస్టరీగా మారింది.

Update: 2024-02-03 05:27 GMT

వారం వ్యవధిలో అగ్రరాజ్యం అమెరికాలో మన దేశానికి చెందిన నలుగురు విద్యార్థులు వరుస పెట్టి చనిపోయిన వైనం ిప్పుడు పెను సంచలనంగా మారటమే కాదు.. వేలాది మంది విద్యార్థుల కుటుంబాల్లో కొత్త భయాన్ని తీసుకొస్తోంది. ఎందుకిలా? జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం లభించటం లేదు.

విదేశాల్లో ఉన్నతచదువుల కోసం వెళుతున్న విద్యార్థులు ఇలా అనుమానాస్పద రీతిలో మరణిస్తున్న వైనం మిస్టరీగా మారింది. కారణాలు పెద్దగా వెల్లడి కావటం లేదు. దీంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన ఐదేళ్లలో విదేశాల్లో విద్యను అభ్యసించే మన విద్యార్తుల్లో ఎంతమంది మరణించిన అంశానికి సంబంధించి తాజాగా పార్లమెంట్ లో వివరాల్ని వెల్లడించారు.

విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేస్తూ.. గడిచిన ఐదేళ్లలో 403 మంది మరణించినట్లుగా విదేశాంగ శాఖ సమహాయమంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. వారి మరణాలకు వివిధ కారణాలున్నట్లుగా ఆయన తెలిపారు. దేశాల వారీగా చూస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు మరణించిన 403లో అత్యధికంగా కెనడాలో మన విద్యార్థుల ప్రాణాలు పోయినట్లుగా పేర్కొన్నారు. కెనడాలో 91 మంది.. ఇంగ్లండ్ లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఉక్రెయిన్ లో 21 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. వారి మరణాల వెనుక కారణం ఏమిటన్న అంశాల్ని మాత్రం వెల్లడించలేదు. ఈ వివరాల్ని కూడా వెల్లడించటంతో పాటు..విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు కొన్ని మార్గదర్శకాల్ని ప్రకటించటం ద్వారా.. వారి తల్లిదండ్రుల్ని మరింత అలెర్టు చేసినట్లుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News