శ్రీకాళహస్తి సీఐ కు హెచ్.ఆర్.సీ.నోటీసులు... వీడియో వైరల్!
శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ కి ఆంధ్ర ప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసిందని తెలుస్తుంది.
శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ కి ఆంధ్ర ప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసిందని తెలుస్తుంది. ఈమెతో పాటు పాటు స్టేషన్ ఆఫీసర్, తిరుపతి డిఎస్పి, తిరుపతి ఎస్పీ, అనంతపురం డిఐజి, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్.ఆర్.సీ. నోటీసులు జారీ చేసిందని తెలుస్తుంది.
అవును... శ్రీకాళహస్తి లో మూడు రోజుల క్రితం జనసేన కార్యకర్తను స్థానిక సీఐ కొట్టారంటూ వెలుగులోకి వచ్చిన వార్తల నేపథ్యంలో ఏపీ హె.ఆర్.సి. ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... విచారణ జరిపి ఈనెల 27న నివేదిక సమర్పించాలని, శ్రీకాళహస్తి సిఐ, తిరుపతి డిఎస్పి, ఎస్పి లకు హెచ్.ఆర్.సీ. ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు.
కాగా... ఏపీలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని కథనాలు రావడం.. దీంతో వాలంటీర్లు పవన్ దిష్టిబొమ్మలు దహనం చేయడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా... పవన్ ఫోటోలను చెప్పులతో కొడుతున్న దృశ్యాలు కనిపించాయని తెలుస్తుంది.
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారని తెలుస్తుంది. అయితే ఈ నిరసన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసిందని అంటున్నారు.
ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న జనసేన నేతలపై సీఐ అంజు యాదవ్ చెంపదెబ్బలతో విరుచుకుపడ్డారంటూ ఒక వీడియో హల్ చల్ చేస్తుంది. ఈ నిరసన కార్యక్రమాల్లో జగన్ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే విషయంలో జనసేన కార్యకర్త సాయి పై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్నారని కథనాలొచ్చాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించిందని తెలుస్తుంది.
అయితే తన పార్టీ కార్యకర్తపై సీఐ చెంపదెబ్బల ఇష్యూ మీడియాలో రావడంతో పవన్ స్పందించారని అంటున్నారు. ఆ విషయం శ్రీకాళహస్తిలోనే తేల్చుకుంటానని పవన్ చెప్పినట్లు చెబుతున్నారు!