మొగుడా..? విటుడా..? భార్యపైనే 72మందితో అత్యా*చారం

సమాజం చెడిపోతోంది.. ప్రేమానురాగాలు మచ్చుకైనా కనిపించడం లేదు.

Update: 2024-09-03 17:30 GMT

సమాజం చెడిపోతోంది.. ప్రేమానురాగాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇండియాలో అంతో ఇంతో ఉన్నా విదేశాల్లో మాత్రం ఆడ వాళ్లు ఓ అంగడి సరుకులా మారిపోయారు. వారిపై ఆకృత్యాలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా జర్మనీలో ఓ భర్త చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ దారుణం తెలిసాక వీడు భర్తయేనా అని అనిపించకమానదు.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు భార్య ఏకంగా 72మందితో కలిసి వీడుచేసిన దారుణం కలిచివేస్తోంది. 72 మందితో కలిసి ఏకంగా 92 సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ దురాగాతాలకు పాల్పడిన వారి వయస్సు 26 నుంచి 73 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు. వారిలో 51 మందిని గుర్తించగా.. మిగిలిన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

ఫ్రాన్సులోని ఓ ప్రభుత్వం రంగ సంస్థలో పనిచేస్తున్న ఈ ప్రబుద్ధుడు వయసు 71 ఏళ్లు. భార్య పట్ల మొదటి నుంచి అతని వైఖరి వింతగానే ఉంది. నిత్యం ఆమెకు డ్రగ్స్ అలవాటు చేసి పాశవికంగా ప్రవర్తించేవాడు. రహస్యతంగా ఆమె తినే ఆహారంలో డ్రగ్స్ కలిపి తినిపించేవాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించేవాడు. వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే రహస్య కెమెరాల్లో చిత్రీకరించేవాడు.

కాగా.. ఈ దారుణాలు 2011 నుంచి 2020 మధ్య చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2020లో ఓ షాపింగ్ సెంటర్‌లో ఆ ప్రబుద్ధుడు కొందరు మహిళలను రహస్యంగా వీడియో తీస్తుండడాన్ని అక్కడి సెక్యూరిటీ గార్డు గుర్తించి పట్టుకున్నాడు. అనంతరం పోలీసులు అతడి ఫోన్, కంప్యూటర్‌ను తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భార్యపై అతడు చేసిన అకృత్యాలు బయటపడ్డాయి. వందల కొద్దీ ఫొటోలు, వీడియోలు దొరికాయి.

చివరకు నిందితుడి భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన కేసును బహిరంగ విచారణ చేపట్టాలని అభ్యర్థించింది. విచారణ కోసం తన ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టును వెళ్లింది. దశాబ్దకాలం పాటు తనకు తెలియకుండానే దారుణాలు జరిగాయని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా బహిరంగ విచారణ సరైనదని పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలపై మహిళలకూ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.


Full View


Tags:    

Similar News