వంద కోట్ల ఓటర్లు...ఇది కదా ప్రజాస్వామ్యమంటే !
ఇక గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల నాటికి దేశంలోని ఓటర్లు 96.88 కోట్ల మందిగా ఉంటే 2025 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లతో ఆ సంఖ్య కాస్త 99.1 ఓటర్లుగా ఒక్కసారిగా పెరిగిపోయింది.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ కి ఎంతో ఖ్యాతి ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు ముప్పయి అయిదు కోట్ల జనాభాతో స్టార్ట్ అయిన భారత్ పయనం ఇపుడు 144 కోట్ల మంది జనాభాకు చేరుకుంది. అంటే ఏడున్నర దశాబ్దాల కాలంలో నాలుగు రెట్లు దేశ జనాభా పెరిగింది అన్న మాట.
ప్రతీ పద్దెనిందేళ్ళకూ దేశ జనాభా రెట్టింపు అయింది అన్న మాట. ఇక 1947 నుంచి నాలుగు దశాబ్దాల పాటు దేశంలో ఓటు వేసే వారి అర్హత వయసు 21గా ఉండేది. అది కాస్తా ఆనాటి యువ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో ఆయన ప్రభుత్వం చేసిన నిర్ణయం వల్ల ఓటు హక్కు 18 ఏళ్ళకే వర్తింపచేస్తారు. అలా ఎక్కువ మంది ఓటర్లు ఎన్నికల క్రతువులో పాల్గొనడం జరుగుతూ వస్తోంది.
ఇక పెరుగుతున్న జనాభా అందులో ఎక్కువగా యువజనుల పాత్రతో దేశంలోని ఓటర్ల సంఖ్య ప్రతీ ఎన్నికకూ అధికమవుతూ వతోంది. అలా చూస్తే కనుక లేటెస్ట్ గా కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్ల జాబితాలో పేర్కొన్న దాని ప్రకారం భారత్ లో 99.1 ఓటర్లు ఉన్నట్లు వెల్లడి అయింది.
ఇక గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల నాటికి దేశంలోని ఓటర్లు 96.88 కోట్ల మందిగా ఉంటే 2025 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లతో ఆ సంఖ్య కాస్త 99.1 ఓటర్లుగా ఒక్కసారిగా పెరిగిపోయింది. అంటే ఏకంగా మూడు కోట్ల మంది అన్న మాట.
ఇక చాలా తొందరలోనే ఈ సంఖ్య 100 కోట్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అదే జరిగితే ప్రపంచంలో వంద కోట్ల ఓటర్లు ఉన్న దేశంగా భారత్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తుంది. దీనిని ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేయలేరు కూడా అని అంటున్నారు.
99.1 ఓటర్లలో చూస్తే వీరిలో 21.7 కోట్ల మంది 18-29 ఏళ్ల మధ్య వయసున్న యువత ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అలాగే మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లకు చేరుకుందని వివరించింది. దీంతో దేశంలో కానీ వివిధ రాష్ట్రాలలో కానీ ప్రభుత్వాల తల రాతలను నిర్ణయించేది మహిళలు యువత మాత్రమే అని స్పష్టం అవుతోంది. అంతే కాదు రాజకీయ పార్టీలు అన్నీ కూడా అధికారం కోసం ఈ రెండు వర్గాలనే గురి పెట్టి పాలిటిక్స్ చేయాల్సిందే అంటున్నారు.
మరో వైపు చూస్తే జమిలి ఎన్నికలు జరిగినా లేక 2029 షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా వంద కోట్లకు పైగా ఓటర్లతోనే సాగుతుందని అంటున్నారు. గతంతో పోలిస్తే యువత పెద్ద ఎత్తున ఓటింగులో పాల్గొంటున్నారు. అలాగే మహిళా ఓటర్లు కూడా ప్రజా తీర్పులో కీలకం అవుతున్నారు. రానున్న రోజులలో టీనేజ్ ఓటర్లు ఇంకా ఎక్కువ అవుతారు అన్నది తెలుస్తున్న క్రమంలో యువ భారతంగా దేశం మారుతోంది. మరి పాలకులలో యువతరాన్ని చూడగలుగుతామా లేదా అన్నది కాలం నిర్ణయించాల్సి ఉంటుంది.