పపంచ ఆహార సూచీలో దిగజారిన భారత్... షాకింగ్ ర్యాంక్!
ఇది 18.7 శాతంగా నమోదైంది. 2022 సంవత్సరం నుండి ఈ విషయంలో దేశ పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తుంది.
ప్రపంచ ఆహార సూచీ–2023 ర్యాకింగ్స్ విడుదలయ్యింది. తాజాగా విడుదలయిన ఈ ర్యాంకింగ్స్ లో భారత్ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇందులో భాగంగా... 125 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ 111వ స్థానానికి చేరుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... జింబాబ్వే స్థానం 110. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
అవును... గ్లోబల్ హంగర్ ఇండెక్స్ - 2023లో భారతదేశ పరిస్థితి మరింత దిగజారిందని సూచిస్తుంది. 125 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఈ ఏడాది భారత్ 111వ స్థానానికి చేరుకుంది. అంతేకాదు... పిల్లల పోషకాహార లోపం కూడా భారతదేశంలో అధికంగా ఉందని తెలుస్తుంది. ఇది 18.7 శాతంగా నమోదైంది. 2022 సంవత్సరం నుండి ఈ విషయంలో దేశ పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తుంది.
గత సంవత్సరం భారతదేశం ఈ సూచికలో 107వ స్థానంలో ఉండగా... తాజాగా విడుదల చేసిన ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 28.7 శాతం స్కోర్ తో 111వ స్థానంలో నిలిచింది. అంటే.. ఆకలి కేకల పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న దేశాల కోటాలోకి భారతదేశం వస్తోందన్నమాట. కాగా... ప్రపంచ, ప్రాంతీయ, జాతీయ స్థాయిలలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, ట్రాక్ చేయడానికి వాడే ఒక సాధనమే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... భారతదేశం ఇతర పొరుగు దేశాలైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ కంటే వెనుకబడి పోయినట్లు ఈ ఇండెక్స్ పేర్కొంది. అవును... ఈ ఇండెక్స్ ప్రకారం.. పాకిస్థాన్ 102, బంగ్లాదేశ్ 81, నేపాల్ 69, శ్రీలంక 60వ స్థానంలో ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ నివేధికలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది అత్యంత లోపభూయిష్టంగా ఉందంటూ కొట్టిపారేసింది. ఇందులో భాగంగా.. "ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు" అంటూ మండిపడటం గమనార్హం. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను తిరస్కరించింది. ఆకలిని కొలవడానికి ఇది తప్పు మార్గం అని పేర్కొంది.