ప్రపంచ డైమండ్స్ వ్యాపార వేదికగా భారత్..! డైమండ్ బోర్స్ తో ఇది సాధ్యమేనా?

ఇక, మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా లాంటి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ప్రధాని వాటిని అన్ని రంగాలకు విస్తరింప చేస్తున్నారు.

Update: 2023-12-17 10:38 GMT

భారత కీర్తిని ప్రపంచానికి చాటుతూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకస్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం ఆయన ప్రపంచ వ్యాప్తంగా కూడా పరిచయం అవసరం లేదు. కొవిడ్ సమయంలో పేద దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడం.. జీ20 సమ్మిట్ అయినా దేశానికి కీర్తి, ప్రతిష్టలు తెచ్చిపెట్టారు ఆయన. దీంతో పాటు చాలా దేశాలు ఇప్పుడు భారత్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి. అంతటి వైభవం భారత్ కు ఉందని ప్రధాని ఎప్పటి నుంచో చెప్తున్నాడు.


ఇక, మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా లాంటి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ప్రధాని వాటిని అన్ని రంగాలకు విస్తరింప చేస్తున్నారు. దేశం అన్ని రంగాల్లో్ ముందుండాలని, అందుకు ప్రతీ ఒక్కరూ పని చేయాలని, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైసెన్స్ లు జారీ చేయడం, వేగంగా అనుమతులు ఇవ్వడం చేస్తున్నాడు. దీంతో దేశం కూడా ఆర్థికంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం భారత్ బ్రిటన్ ను దాటి ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచ వేదికపై మరో అరుదైన పని చేశారు ప్రధాని మోడీ.


ప్రపంచలోనే అతిపెద్ద భవనమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ను మోడీ ఇటీవల ప్రారంభించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్ లో పర్యటిస్తున్న ఆయన మొదట రోడ్ షో నిర్వహించారు. తర్వాత సూరత్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ప్రారంభించారు. ఆ తర్వాత 35.54 ఎకరాల్లో నిర్మించిన 'సూరత్ డైమండ్ బోర్స్' భవనాన్ని ప్రారంభించారు. ఈ భవనం రూ. 3400 కోట్లతో నిర్మించారు. ప్రపంచంలోని వజ్రాల వ్యాపారానికి ఇది కేంద్రంగా మారనుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్‌ కనెక్టడ్ భవనం. ఈ భవనంలో 4500 వరకు కార్యాలయాలు ఉన్నాయి. ఇది పెంటగాన్ లో ఉన్న భవనం కంటే కూడా డైమండ్ బోర్స్ చాలా పెద్దది.


రానున్న కాలంలో ఈ భవనమే అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్ గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రత్నాల రాజధానిగా సూరత్ కు గుర్తింపు ఉంది. దేశంలో 90 శాతం వజ్రాలు ఇక్కడే తయారవుతాయి. దాదాపు 65 వేల మంది డైమండ్ నిపుణులకు ఈ సెంటర్ వేదిక కానుంది. దీంతో దేశంలో డైమండ్ వ్యాపారాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లు అవుతుందని మోడీ ప్రభుత్వం ఈ భవనాన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

మొత్తం 15 అంతస్తులు ఉన్న ఈ సూరత్ డైమండ్ బోర్స్ 35.54 ఎకరాల్లో నిర్మించారు. ఇది 9 దీర్ఘ చతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ కేంద్ర భవనానికి కనెక్ట్ అయి ఉంటాయి. 6 లక్షల 20 వేల చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఇందులో 4500 ఆఫీసులు ఉండగా.. పార్కింగ్ కోసం 20 లక్షల చదరపు అడుగులను విడిచిపెట్టారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నాలుగేళ్లు పట్టినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.

Tags:    

Similar News