ఇండియా పాస్ పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు ఇవీ

భారత పాస్‌పోర్ట్ కావాలంటే ఇక నుంచి నిబంధనల్లో కీలక మార్పుల చేసింది కేంద్రప్రభుత్వం. పాస్‌పోర్ట్ నిబంధనలను సవరించింది.;

Update: 2025-03-06 06:09 GMT

భారత పాస్‌పోర్ట్ కావాలంటే ఇక నుంచి నిబంధనల్లో కీలక మార్పుల చేసింది కేంద్రప్రభుత్వం. పాస్‌పోర్ట్ నిబంధనలను సవరించింది. 1980 పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులను ఈ వారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తర్వాత అమలులోకి వస్తాయి.

-కొత్త భారత పాస్‌పోర్ట్ నిబంధన

2023 అక్టోబర్ 1 లేదా తర్వాత జన్మించిన వ్యక్తులు పాస్‌పోర్ట్ (అప్లికేషన్) కోసం జనన సర్టిఫికేట్‌ను మాత్రమే జన్మతేదీ రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ జనన సర్టిఫికేట్, జనన మరణాల నమోదు అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ లేదా 1969 జనన మరణాల నమోదు చట్టం ప్రకారం అధికారం కలిగిన ఏదైనా ఇతర అధికార సంస్థ జారీ చేయాలి.

- భారత పాస్‌పోర్ట్ (అప్లికేషన్) కోసం అవసరమైన పత్రాల జాబితా:

1.జన్మ రుజువు పత్రాలు – (2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వారి కోసం కింది పత్రాల్లో ఏదైనా ఒకటి) జనన మరణాల నమోదు అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ లేదా 1969 చట్టం ప్రకారం అధికారంగా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ జారీ చేసిన జనన సర్టిఫికేట్.

2.ట్రాన్స్ఫర్/స్కూల్ లీవింగ్/మాట్రిక్యులేషన్ సర్టిఫికేట్ (చివరిగా చదివిన పాఠశాల లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డు జారీ చేసినది).

3.పబ్లిక్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్/కంపెనీల ద్వారా జారీ చేయబడిన పాలసీ బాండ్ (ఇన్సూరెన్స్ హోల్డర్ యొక్క DOBతో).

4.ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వారి సేవా నమోదులోని పత్రాల నకలు లేదా పెన్షన్ ఆదేశం (రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం) సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా విభాగాధిపతి ద్వారా ధృవీకరించబడినది.

5.ఆధార్ కార్డు / ఈ-ఆధార్.

6.భారత ఎన్నికల కమిషన్ ద్వారా జారీ చేయబడిన ఓటర్ ఐడి (EPIC).

7. ఆదాయపు పన్ను విభాగం ద్వారా జారీ చేయబడిన PAN కార్డు.

8. రాష్ట్ర రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్.

9.అనాధాశ్రమం/చైల్డ్ కేర్ హోమ్ అధిపతి అధికారిక లెటర్ హెడ్‌పై ఇచ్చిన జన్మతేదీ ధృవీకరణ పత్రం.

- చిరునామా రుజువు కోసం అవసరమైన పత్రాలు:

* నీటి బిల్లు.

* టెలిఫోన్ (ల్యాండ్‌లైన్ లేదా పోస్ట్‌పెయిడ్ మొబైల్ బిల్లు).

* విద్యుత్ బిల్లు.

* ఆదాయపు పన్ను అంచనా ఉత్తర్వు.

* ఎన్నికల గుర్తింపు కార్డు.

* గ్యాస్ కనెక్షన్ ధృవీకరణ పత్రం.

* పేరొందిన సంస్థల అధికారి ద్వారా జారీ చేయబడిన ఉద్యోగ ధృవీకరణ పత్రం.

* జీవిత భాగస్వామి (స్పౌస్) పాస్‌పోర్ట్ నకలు (మొదటి, చివరి పేజీలు మరియు దంపతుల వివరాలతో).

* మైనర్ల కోసం తల్లిదండ్రుల పాస్‌పోర్ట్ నకలు (మొదటి, చివరి పేజీలు).

* ఆధార్ కార్డు.

* అద్దె ఒప్పంద పత్రం.

* బ్యాంక్ ఖాతా ఫోటో పాస్‌బుక్ (పబ్లిక్ సెక్షన్ బ్యాంకులు, ప్రైవేట్ ఇండియన్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో మాత్రమే).

గమనిక: ఆధార్ కార్డు సమర్పిస్తే పాస్‌పోర్ట్ (అప్లికేషన్) ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

Tags:    

Similar News