భారతీయ పాస్ పోర్ట్ లలో ఈ నాలుగు రంగులకు అర్ధం తెలుసా?

అంతర్జాతీయంగా ప్రయాణించాలనుకునే పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసే ముఖ్యమైన ప్రయాణ పత్రం పాస్ పోర్ట్ అనేది తెలిసిన విషయమే.

Update: 2024-10-02 08:30 GMT

అంతర్జాతీయంగా ప్రయాణించాలనుకునే పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసే ముఖ్యమైన ప్రయాణ పత్రం పాస్ పోర్ట్ అనేది తెలిసిన విషయమే. అయితే... ఈ పాస్ పోర్టులు వీవిధ రంగులలో వస్తాయి.. ఈ రంగు హోల్డర్ స్థితి, ప్రయాణ ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంగా భారత్ లో ఉండే పాస్ పోర్ట్ లు వాటికి సంబంధించిన రంగులకు గల కారణాలు ఏమిటనేది చూద్దాం...!

అవును... సాధారణంగా పాస్ పోర్ట్ అంటే నేవీ బ్లూ కలర్ లో ఉంటుందనే విషయం తెలిసిందే. వీటితో పాటు భారత ప్రభుత్వం మరో మూడు రంగుల్లో పాస్ పోర్ట్ లను జారీ చేస్తుంది! అవి... తెలుపు, మెరూన్, గ్రే రంగులలో ఉంటాయి.

సాధారణ పాస్ పోర్ట్ (నేవీ బ్లూ):

భారతదేశంలో సాధారణ పౌరుల కోసం జారీ చేసే పాస్ పోర్ట్.. నేవీ బ్లూ కలర్ లో ఉంటుంది. వ్యాపారం, ఉపాధి, పర్యాటకం, విద్య వంటి సాధారణ ప్రయాణాల కోసం ఈ రకమైన పాస్ పోర్ట్ ను జారీ చేస్తారు. ఇది పెద్దలకు 10 సంవత్సరాలు, 18ఏళ్ల లోపు మైనర్ లకు 5 సంవత్సరాలు చెల్లుతుంది!

అధికారిక పాస్ పోర్ట్ (తెలుపు):

అధికారిక లేదా దౌత్యపరమైన పనుల కోసం ఇతర దేశాలకు వెళ్లే అధికారులకు భారత ప్రభుత్వం ఈ తెలుగు రంగు పాస్ పోర్ట్ ను జారీ చేస్తుంది. ప్రభుత్వ ప్రతినిధులు, బ్యూరోక్రాట్ లు, ఇతర అధికారులు ఇందులో ఉంటారు. ఈ పాస్ పోర్ట్ సాధారణంగా మిషన్ వ్యవధి లేదా ఏదైనా అసైన్మెంట్ కోసం జారీ చేయబడుతుంది.

దౌత్య పాస్ పోర్ట్ (మెరూన్):

దౌత్యవేత్తలు, కాన్సుల్స్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ సభ్యులు వంటి ఉనంత స్థాయి ప్రభుత్వ అధికారుల కోసం ఈ మెరూన్ కలర్ పాస్ పోర్ట్ రిజర్వ్ చేయబడింది. ఇది వారికి వివిద దేశాలలో సున్నితమైన ఆచారాలు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలతో సహా ప్రత్యేక అధికారాలను మంజూరు చేస్తుంది. ఇది దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులకు జారీ చేయబడుతుంది.

ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (గ్రే):

వాస్తవానికి టెక్నికల్ గా ఇది పాస్ పోర్ట్ కానప్పటికీ.. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు పాస్ పోర్ట్ లు పోగొట్టుకున్న సమయంలో తిరిగి స్వదేశానికి తిరిగి రావడానికి జారీ చేయబడుతుంది ఈ ఎమర్జెన్సీ సర్టిఫికెట్. ఇది సాధారణంగా ఒకే ప్రయాణానికి చెల్లుబాటు అవుతుంది.

ఇది భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ ద్వారా జారీ చేయబడుతుంది.

Tags:    

Similar News