విప్లవాత్మక నిర్ణయం... ఇండియన్ ఆర్మీలో స్కిన్ బ్యాంక్!

అవును... భారత సైన్యం తొలిసారిగా స్కిన్ బ్యాంక్ ను ప్రారంభించింది. ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్ లో ఈ స్కిన్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు

Update: 2024-06-19 05:33 GMT

ఆర్మీలో పనిచేసేవారికి నిత్యం ఎన్నో శారీరక గాయాలు అవుతూనే ఉంటాయనేది తెలిసిన విషయమే. ఇక బాంబ్ బ్లాస్ట్ లు జరిగినప్పుడు, ఎన్ కౌంటర్లు జరిగినప్పటి సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో... ఇండియన్ ఆర్మీ తొలిసారిగా "చర్మనిధి కేంద్రా" (స్కిన్ బ్యాంక్) ని ప్రారంభించింది. ఈ మేరకు ఈ బ్యాంక్ ఉద్దేశ్యం, లక్ష్యాలను వెల్లడిస్తూ రక్షణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

అవును... భారత సైన్యం తొలిసారిగా స్కిన్ బ్యాంక్ ను ప్రారంభించింది. ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్ లో ఈ స్కిన్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా... ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు!

ప్రధానంగా ప్లాస్టిక్ సర్జన్లు, ప్రత్యేక టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ సహా అత్యున్నత స్థాయి వైద్య బృందం ఇక్కడ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బ్యాంక్ లో స్కిన్ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ అనే ప్రక్రియలు ఉంటాయి. అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ హాస్పటల్స్ కు ఇక్కడ నుంచి చేరవేస్తారు!

ఏమిటీ "చర్మనిధి కేంద్రా"..?

కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, తెగిన చేతులు, వేళ్లు అతికించడం మొదలైన చికిత్సలకు చర్మం అవసరం ఉంటుంది. ఈ సమయంలో... రోగి శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు, తదితర భాగాల నుంచి చర్మం సేకరించి, గ్రాఫ్టింగ్ ద్వారా గాయాలైన చోట అమర్చుతున్నారు. అయితే... ఇది 15-20 శాతం మాత్రమే సేకరించడం వీలవుతుంది.

ఒకవేళ రోగి శరీరం నుంచి అంతకంటే ఎక్కువ సేకరించాల్సి వచ్చినప్పుడు.. స్కిన్ అందుబాటులో ఉండటం లేదు. ఈ ఇబ్బందిని అధిగమించే ఉద్దేశ్యంతోనే ఈ చర్మనిధి కేంద్రా (స్కిన్ బ్యాంక్) ను ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News