భారత సంతతి సర్జన్ పై 14 లైంగిక వేధింపుల అభియోగాలు!

గత ఏడాది మార్చిలో ఈ హాస్పటలోని మహిళా ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు.

Update: 2024-05-30 04:35 GMT

ఇంగ్లాండ్‌ లోని లాక్ షైర్‌ లోగల బ్లాక్‌ పూల్ విక్టోరియా హాస్పిటల్‌ లో లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా భారతీయ సంతతికి చెందిన సర్జన్‌ పై అభియోగాలు మోపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. పైగా సదరు వైద్యుడు భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఇరుదేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

గత ఏడాది మార్చిలో ఈ హాస్పటలోని మహిళా ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఇందులో భాగంగా... 54 ఏళ్ల అమల్ బోస్‌ తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో... బోస్ ను ఆసుపత్రిని నిర్వహిస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ సస్పెండ్ చేసింది. అనంతరం దర్యాప్తు ప్రారంభమైంది.

ఈ సందర్భంగా స్పందించిన లాక్ షైర్‌ పోలీసులు... థర్న్‌ హామ్‌ కు చెందిన అమల్ బోస్ పై ఆరుగురు మహిళా బాధితులు ఫిర్యాదు చేశారని. దీనికి సంబంధించి సెక్షన్ 3 లైంగిక నేరాల చట్టం 2003కి విరుద్ధంగా లైంగిక వేధింపులకు పాల్పడిన 14 అభియోగాలు మోపారని తెలిపారు. ఆరోపించిన బాధితులందరూ బ్లాక్‌ పూల్ విక్టోరియా హాస్పిటల్‌ లోని సిబ్బంది అని అన్నారు.

ఇదే సమయంలో ఆరోపించిన నేరం 2017 - 2022 మధ్య జరిగింది. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం కూడా స్పందించింది. ఇందులో భాగంగా... ఆసుపత్రిని నిర్వహిస్తున్న బ్లాక్‌ పూల్ టీచింగ్ హాస్పిటల్స్ ఎన్.హెచ్.ఎస్. ఫౌండేషన్ ట్రస్ట్ ఈ ఆరోపణలను ధృవీకరించింది.. పోలీసు విచారణకు సహకరిస్తామని హామీ ఇచ్చింది.

ఆసుపత్రిలో కార్డియోవాస్కులర్ సర్జరీ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న బోస్... లాంకాస్టర్ సమీపంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అతడిని జూన్ 7న లాంకాస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. దీంతో ఆ రోజు కోర్టు ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుందనేది ఆసక్తిగా మారింది!

Tags:    

Similar News