సీట్ల సేరింగ్ కు ఇండియా రెడీ అవుతోందా ?
ఇది బాగానే ఉంది మరి మిగిలిన 443 నియోజకవర్గాల మాటేమిటి ? అసలు పేచీ అంతా ఇక్కడే వస్తోంది.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఇండియాకూటమి రెడీ అవుతోంది. మొత్తం 543 సీట్లలోను బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అభ్యర్ధులపై ఇండియాకూటమి తరపున వన్ ఆన్ వన్ ఫార్ములా ప్రకారం ఒకే అభ్యర్ధిని పోటీకి దింపాలని కూటమిలోని కీలక నేతలు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే కో ఆర్డినేషన్ కమిటీని కూడా నియమించుకున్నారు. ఈ కమిటి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల బలాబలాలను భేరీజు వేసి ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేయానే విషయమై ఒక రిపోర్టు తయారుచేస్తుంది.
ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం 100 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు బీజేపీ లేదా ఎన్డీయే అభ్యర్ధులపై డైరెక్టు ఫైటుకు రెడీ అవుతారు. ఈ వంద నియోజకవర్గాల్లో ప్రాంతీయపార్టీల్లోని భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతుగా నిలబడతారు. ఇది బాగానే ఉంది మరి మిగిలిన 443 నియోజకవర్గాల మాటేమిటి ? అసలు పేచీ అంతా ఇక్కడే వస్తోంది. జమ్మ-కాశ్మీర్ రాష్ట్రంలోని ఐదు స్ధానాల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమక్రటిక్ పార్టీలు పంచుకోవాలి.
బెంగాల్లోని 42 సీట్లను తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాలు పంచుకోవాలి. ఇక్కడ మమతాబెనర్జీ ఏమంటారో తెలీదు. మహారాష్ట్రలోని 48 నియోజకర్గాల్లో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, శివసేన తలా 16 నియోజకవర్గాల్లో పోటీచేయాల్సుంటుంది. కాకపోతే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అన్నది తేలటమే కష్టం.
బీహార్లోని 40 నియోజకవర్గాలను పంచుకోవటం కష్టమే. ఎందుకంటే అధికార జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్ల పంపిణీ కష్టమవుతుంది. ఢిల్లీలోని ఏడు సీట్లు కాంగ్రెస్-ఆప్ మధ్య షేరింగ్ కు రెడీ అవ్వచ్చు. కానీ పంజాబ్ లోని 13 సీట్లను పంచుకోవటానికి ఆప్ ఇష్టపడటంలేదు. ఇక ఏపీలో ఇండియాకూటమిలోని ఏ పార్టీకీ బలంలేదు. స్ధూలంగా చూస్తుంటే కొన్ని రాష్ట్రాల్ సీట్ల సర్దుబాటులో సమస్యలు లేకపోవచ్చు. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో కష్టమవుతుంది. అందుకనే అన్నీ పార్టీలు త్యాగాలకు సిద్ధమైతే కానీ ఇండియాకూటమి బలంగా అడుగులు ముందుకు పడవు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడల్సిందే.