ఇండియా లోని ఈ నిశ్శబ్ద నగరం గురించి మీకు తెలుసా?

ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్లకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Update: 2024-06-24 23:30 GMT

ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్లకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జెంటు పని మీద బయలుదేరినప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం మనలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇలాంటి సమయాల్లో హారన్ సౌండ్ వల్ల ఎక్కడలేని ఇరిటేషన్ రావడం కూడా కామనే. అయితే ఒక నగరంలో మాత్రం ట్రాఫిక్ జామ్స్ ఉండవు.. అక్కడ వాహనాలు ఎంతో సాఫీగా సాగిపోతూ ఉంటాయి. అంతేకాదు అసలు హారన్ మోత వినిపించదు. ఇంత సైలెంట్ సిటీ మన ఇండియాలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా.. ఉండండి.. పదండి మరి ఆ సిటీ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి బిజీ సిటీస్ లో నివసించే వారికి ట్రాఫిక్ జామ్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో బాగా తెలుస్తుంది. చాలా తక్కువ దూరం ప్రయాణించడానికి కూడా ఈ నగరాలలో ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ లో నిలబడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ట్రాఫిక్ జామ్స్ కు ఆస్కారం లేకుండా సాఫీగా నడిచే ఓ నగరం మన భారతదేశంలో ఉంది. మిజోరం రాజధాని అయిన ఐజ్వాల్ సైలెంట్ సిటీగా పేరు తెచ్చుకుంది.

ఎందుకంటే ఇక్కడ రోడ్డుపై వాహనాలు ఒక క్రమ పద్ధతిలో వెళ్తాయి. ఎక్కడ ట్రాఫిక్ జాముల వంటి సమస్యలు ఉత్పన్నం అవ్వవు. అత్యంత ప్రశాంతమైన నగరంగా పరిగణించబడే ఈ ప్రదేశంలో వాహనాలను ఓవర్టేక్ కూడా చేసుకోవు. ఇప్పటికే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులను హెల్మెట్ పెట్టుకోండి, సీటు బెల్టు పెట్టుకోండి అని గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రజలు సహజంగానే వీటిని ఆచరిస్తారు కాబట్టి ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ప్రత్యేకంగా పాఠాలు చెప్పినట్టు చెప్పనక్కర్లేదు.

ఇక్కడ అన్ని వాహనాలు రోడ్డుపై ఎడమవైపు నడుస్తాయి. పొరపాటున కూడా ఎవరు వారు నడిపే ట్రాక్కును దాటి నెక్స్ట్ ట్రాక్ కు వెళ్లడం.. అనవసరంగా హారన్ మోగించడం వంటివి చేయరు. ఐజ్వాల్ లో వాహనాలకు ప్రత్యేకమైన లేన్స్ ఉంటాయి. ఫోర్ వీలర్ వెహికల్స్ కు, టూ వీలర్ వెహికల్స్ కు ప్రత్యేకమైన లేన్స్ ఉంటాయి. ఎవరి లెన్స్ లో వాళ్లు వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడదు.

మన రోడ్స్ కి ఉన్నట్టు ఇక్కడ డివైడర్స్ కూడా ఉండవు. ప్రజలు సెల్ఫ్ డిస్ప్లేన్ తో ఉంటారు కాబట్టి.. ఇక్కడ ఎటువంటి నియమాల ఉల్లంఘన జరగదు. అందుకే ఎటువంటి అడ్డంకులతో అవసరం లేదు. మరి అత్యవసర పరిస్థితుల్లో ఒకటి లేక రెండు సార్లు హారన్ మోగిస్తారు. మనదేశంలో అన్ని ప్రదేశాలలో ఎటువంటి నియమాలు పాటిస్తే ట్రాఫిక్ జామ్ సమస్యలే కాదు యాక్సిడెంట్ లాంటివి కూడా జరగకుండా ఉంటాయి.

Tags:    

Similar News