ఆ సర్వే రూటే సపరేటు.. రోజు ఆలస్యంగా వెల్లడి!

పోలింగ్ టైం పూర్తైందో లేదో.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడించటంలో మహా హడావుడినే ప్రదర్శించాయి సంస్థలు.

Update: 2023-12-02 04:30 GMT

పోలింగ్ టైం పూర్తైందో లేదో.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడించటంలో మహా హడావుడినే ప్రదర్శించాయి సంస్థలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు డజన్ల వరకు ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత వెల్లడించాయి. అయితే.. ఒక సంస్థ మాత్రం మిగిలిన వారికి భిన్నంగా ఒక రోజు ఆలస్యంగా తమ ఫలితాల్ని వెల్లడించింది. అదే.. ఇండియాటుడే యాక్సిస్ మై సర్వే.

శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన ఆ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వే.. రాత్రి 9 గంటల నాటికి తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎందుకు రానుంది? తెలంగాణను మూడు ముక్కలుగా చేసి.. ఏయే ప్రాంతంలో ఎవరికి అధిక్యత రానుంది? ఎంత రానుంది? ఇలా లోతైన విశ్లేషణతో తమ రిజల్ట్ ను వెల్లడించారు. ఇప్పటికే రెండు డజన్ల వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడైన తర్వాత కూడా ఇండియా టుడే సర్వే పట్ల ఆసక్తి ఉంటుందా? అంటే.. తప్పనిసరిగా ఉంటుందని చెప్పాలి.

ఎందుకంటే.. 2018లో ఇదే సంస్థ తెలంగాణలో నాటి టీఆర్ఎస్ కు అత్యధిక సీట్లు వస్తాయని చెప్పటమే కాదు.. రియల్ గా వచ్చిన సీట్ల సంఖ్యను దగ్గరగా అంచనా వేసింది ఇదే సంస్థ. అంతేకాదు, దేశంలో ఇప్పటివరకు జరిగిన పదుల ఎన్నికల ఫలితాల్లో వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో మాత్రం ఈ సంస్థ అంచనా తప్పైంది. నూటికి 92 శాతం వరకు పక్కాగా అంచనా వేసే టాలెంట్ ఈ సంస్థ సొంతం. ఇంతకీ తెలంగాణలో అధికారం ఎవరి చేతికి చిక్కనుంది? అన్న అంశంలోకి వెళితే.. కాంగ్రెస్ పార్టీకేనని తేల్చింది.

అధికార బీఆర్ఎస్ కు షాక్ తప్పదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ కు 34-44 సీట్లు వస్తాయని తేల్చిన ఇండియా టుడే యాక్సిస్ మై సర్వే.. కాంగ్రెస్ పార్టీ కనిష్ఠంగా 63 స్థానాలు.. గరిష్ఠంగా 73 స్థానాల వరకు సొంతం చేసుకుంటుందని స్పష్టం చేసింది. బీజేపీకి 4-8 వరకు సీట్లు వస్తాయని లెక్కేసింది. ఇక.. మజ్లిస్ కు 5-8 సీట్లు వచ్చే వీలుందని చెప్పింది. తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను వివరించింది.

మధ్యప్రదేశ్ (అధికారంలోకి వచ్చే అవకాశం బీజేపీకి)

బీజేపీ - 140-162

కాంగ్రెస్ - 68-90

ఇతరులు - 0-3

రాజస్థాన్ (అధికారంలోకి వచ్చే అవకాశం కాంగ్రెస్)

బీజేపీ - 80-100

కాంగ్రెస్ - 86-106

ఇతరులు 9-18

ఛత్తీస్ గఢ్

బీజేపీ - 36-46

కాంగ్రెస్ - 40-50

ఇతరులు - 1-5

మిజోరం (అధికారంలో జెడ్ పీఎం)

ఎంఎన్ఎఫ్ మిజోరాం నేషనల్ ఫ్రంట్ - 3-7

జెడ్ పీఎం - 28-35

బీజేపీ - 0-4

Tags:    

Similar News