షాకింగ్ : 30 ఏళ్ల మహిళను మింగిన కొండ చిలువ
చనిపోయిన కొండచిలువ నుంచి తన భార్యను బయటకు లాగాడు. అప్పటికే ఆమె మృతి చెందింది. విషయం స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కొండ చిలువలు మేకలు, గొర్లను, మనుషులను మింగి చంపేశాయని చాలా సందర్భాల్లో చూశాం, విన్నాం. మరోసారి అలాంటి షాకింగ్ సంఘటన ఇండోనేషియాలో జరిగింది. 30 అడుగుల అతి పెద్ద కొండచిలువ ఏకంగా 30 ఏళ్ల వయసు ఉన్న మహిళను మింగేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇండోనేషియాలోని సౌత్ సులవేసి లోని ఏజెన్సీ ప్రాంతంలో నివసించే సిరియతి అనే మహిళకి ఐదుగురు పిల్లలు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే సిరియతి పిల్లల్లో ఒకరికి అనారోగ్యం చేయడంతో మెడిసిన్ కోసం సమీపంలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లింది.
సిరియతి ఎంతకీ రాకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ భర్త కొద్దిసేపటి తర్వాత అటవి మార్గంలో వెల్తున్న సమయంలో ఒక పెద్ద కొండచిలువ తన భార్య సిరియతిని కాళ్ల వరకు మింగిన దృశ్యం అతడి కంట పడింది. వెంటనే కోపంతో ఆ కొండచిలువను పక్కన ఉన్న కర్రతో కొట్టి చంపాడు.
చనిపోయిన కొండచిలువ నుంచి తన భార్యను బయటకు లాగాడు. అప్పటికే ఆమె మృతి చెందింది. విషయం స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చనిపోయిన సిరియతి ని కొండచిలువ మింగిన విధానం స్థానికంగా ఉండే వారికి భయాందోళనకి గురి చేసినట్లుగా చెప్పుకుంటున్నారు.