భర్త కోసం వెదుకుతున్నాను... 30 మినిట్స్ లో రిజల్ట్!
అవును... బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ కరోలినా గీట్స్.. భర్త కోసం వినూత్న పద్దతిని ఎంచుకుంది.
సరైన జీవిత భాగస్వామి దొరకడం అంత చిన్న విషయం కాదు.. దానికి చాలా అదృష్టం ఉండాలి అని అంటారు. పైగా ఈ రోజుల్లో అయితే మరింత కష్టం అని, అందుకు పెట్టిపుట్టాలనే కామెంట్లు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా "భర్త కోసం వెదుకుతున్నాను" అని ఒక బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ భర్తను ఎంచుకోవడానికి కొత్త మార్గం ఎంచుకుంది.
అవును... బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ కరోలినా గీట్స్.. భర్త కోసం వినూత్న పద్దతిని ఎంచుకుంది. పైగా ఇప్పటికే ఆయా డేటింగ్ యాప్ లలో పరిచయాలతో చాలా మంది పురుషులతో స్నేహం చేసినా వాళ్లేవరూ నచ్చలేదని, స్టార్టింగ్ లో ఒకలా క్రమక్రమంగా మరోలా మారుతున్నారని.. దీంతో వారందరినీ లైట్ తీసుకున్నాని.. టైం వేస్ట్ చే సుకున్నానని చెబుతుంది కరోలినా!
దీంతో ఇంక యాప్ లను, స్నేహితులను, స్నేహితుల స్నేహితులను నమ్ముకుంటే ప్రయోజనం లేదని... ఆన్ లైన్ లో స్నేహాల వల్ల సమయం వృధా తప్ప ప్రయోజనం శూన్యమని ఆమె బలంగా ఫిక్సయ్యిందంట. దీంతో సరికొత్తగా అలోచించి రోడ్డెక్కేసింది. ఈ క్రమంలో "భర్త కోసం వెదుకుతున్నాను" అని రాసి ఉన్న ఒక బోర్డును రెండు చేతులతో పైకెత్తిపట్టుకుని రోడ్డుపై నిలుచుంది.
అయితే ఈ వినూత్న ఆలోచనపై మీడియాతో మాట్లాడిన కరోలినా... తాను ఒక సైన్ బోర్టుపై "భర్త కోసం వెదుకుతున్నాను" అని రాసి దానిని పట్టుకుని, పట్టణంలో తిరగాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. టిండర్, హింజ్ లాంటి డేటింగ్ యాప్ ల ద్వారా పలువురు పురుషులతో స్నేహం చేసి సమయం వృథా చేసుకున్నానని ఆమె తెలిపింది. ఆన్ లైన్ పరిచయాలతో అలిసి పోయి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది.
అయితే ఈమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆమె రోడ్లపై ఈ బోర్టు పట్టుకుని తిరుగుతుండగా ఒక 30 నిముషాల తర్వాత ఒక వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. చూపులు కలిసిన శుభవేళ ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఉత్సాహంలో మరోసరి మీడియాతో మాట్లాడిన కరోలీనా... భర్త కోసం వెదుకుతూ రోడ్డు మీదకు వచ్చిన 30 మినిట్స్ కే తనకు ఫలితం కనిపించిందని తెలిపింది. ఈ ఇష్యూ ఆన్ లైన్ వేదికగా వైరల్ అయ్యింది.