నడి రోడ్డు మీద అమ్మాయిని అడ్డుకొని బట్టలు చించేశాడు

ఈ ఘోరానికి పాల్పడిన వ్యక్తిని స్థానిక బాలాజీ నగర్ కు చెందిన పెద్ద మారయ్యగా చెబుతున్నారు

Update: 2023-08-07 06:59 GMT

విన్నంతనే వికారం పుట్టించే ఈ దారుణ ఉదంతం హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకుంది. ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో.. ఇలాంటివి జరుగుతాయని అనుకుంటాం. కానీ.. నగరంలో ప్రధాన ప్రాంతంగా మారుతున్న జవహర్ నగర్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న దారుణ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

జవహర్ నగర్ కార్పొరేషన్ లోని బాలాజీ నగర్ లో రోడ్డు మీద తల్లితో పాటు నడుచుకుంటున్న వెళుతున్న ఒక మహిళ మీదకు ఒక అకతాయి అడ్డుకున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగిగా వార్తలు వచ్చినా అందులో నిజం లేదని.. అతనేమీ పోలీస్ కానిస్టేబుల్ కాదని స్పష్టం చేస్తున్నారు. ఆకతాయి పనులతో అందరిని ఇబ్బందులకు గురి చేసే అతడు మద్యం మత్తులో ఆమె మీద దాడికి పాల్పడ్డాడు.

ఆమె జుట్టు పట్టి లాగి కొట్టటంతో పాటు.. ఆమె ఒంటి మీద ఉన్న బట్టల్ని చింపేశాడు. నడిరోడ్డు మీద విచక్షణరహితంగా దాడి చేస్తున్న ఉదంతాన్ని చూసినంతనే స్థానికులు స్పందించారు.

అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారి మీదా దాడికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఎంత వేడుకుంటున్నా.. వినకుండా ఆమె బట్టల్ని చింపేసి వివస్త్రకు పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడే వేళ.. స్థానికులు అతి కష్టమ్మీదా ఆమెను కాపాడారు. అనంతరం నగ్నంగా ఆమెకు రక్షణగా అక్కడే ఉన్న ఫ్లెక్సీని రక్షణగా కప్పారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ దారుణానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News