కుంకుమ పువ్వు నేలలో 'ఉరి'మిన శిక్ష.. ఏడాదిలోనే 901 మందికి..
మరీ ముఖ్యంగా డిసెంబరులో వారంలోనే 40 మందిని ఉరి తీశారట. ఈ సంగతిని ఐక్య రాజ్య సమితి (ఐరాస) తెలిపింది. ఏటా ఉరితీతలు పెరుగుతుండడం ఆందోళనకరం అని పేర్కొంది.
ఒకే ఒక ఘటన 2022లో ఇరాన్ ను కుదిపేసింది.. మోరల్ పోలీస్ కస్టడీలో ఉన్న యువతి మృతిచెందడం తీవ్ర ఆందోళనలకు కారణమైంది.. హిజాబ్ ధరించే నిబంధనను పాటించలేదన్న కారణంతో మాసా అమిని అనే యువతిని ఇరాన్ మోరల్ పోలీస్ తీవ్రంగా హింసిచడంతో ఆమె అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఉదంతం ఇరాన్ ను అట్టుడికేలా చేసింది. యువతులు, మహిళలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం అణచివేయడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారనే కథనాలు వచ్చాయి. అత్యంత ఖరీదైన పంట కుంకుమ పువ్వు 90 శాతం ఇరాన్ లోనే పండుతుంది. అలాంటి నేల రక్తంతో తడిసింది.
ఆధునికం నుంచి సంప్రదాయంలోకి యూరప్ దేశాల ప్రభావంతో ఇరాన్ 1970ల వరకు ఆధునికంగానే ఉండేది. అయితే, ఇస్లామిక విప్లవం అనంతరం సంప్రదాయ దేశంగా మారింది. దీనినే వారు ఇస్లామిక్ రెవల్యూషన్ గా పేర్కొంటున్నారు. ఆయతుల్లా ఖొమైనీ సారథ్యంలో జరిగిన ఈ ఉద్యమం ఇరాన్ స్థితిగతులను మార్చివేసింది. ఖొమైనీలు సుప్రీం లీడర్ గా ఆవిర్భవించారు. ఇక ఇరాన్ లో అధ్యక్షుడు, ప్రధాని ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ ఆదేశాలే అంతిమం. ఇప్పుడు బయటకు వచ్చిన గణాంకాల ప్రకారం 31 మంది మహిళలు సహా గత ఏడాది ఇరాన్ లో 901 మందికి మరణశిక్ష విధించారు.
డిసెంబరులో..
మరీ ముఖ్యంగా డిసెంబరులో వారంలోనే 40 మందిని ఉరి తీశారట. ఈ సంగతిని ఐక్య రాజ్య సమితి (ఐరాస) తెలిపింది. ఏటా ఉరితీతలు పెరుగుతుండడం ఆందోళనకరం అని పేర్కొంది.
హత్య, డ్రగ్స్ రవాణా, అత్యాచారం, లైంగిక దాడి నేరాల్లో ఇరాన్ లో మరణ శిక్ష విధిస్తుంటారు. చైనా తర్వాత ఈ శిక్ష ఇరాన్ లోనే ఉరితీతలు ఎక్కువ.
భయం పుట్టించేందుకు తప్పు చేసినవారిని శిక్షించడంలో తప్పు లేదు. అయితే, ఇది వారిలో పరివర్తనకు కారణం కావాలనేది హక్కుల కార్యకర్తల అభిప్రాయం. కానీ, ఉరి శిక్షే అంతిమ న్యాయం కాకూడదనేది వారి వాదన. ఇక ఇరాన్ ప్రభుత్వం కూడా ఉరి శిక్షలను ప్రజల్లో భయం పుట్టేందుకు ఆయుధంగా వాడుతోందని హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. మాసా అమిని ఉదంతం అనంతరం భారీ ఆందోళనలు జరిగాయి. దీంతో ఉరిశిక్షను చూపించి భయపెట్టడం ఎక్కువైందట. అయితే, 2024లో డ్రగ్స్ కేసుల్లోనే ఉరి ఎక్కువగా అమలైంది. అమిని ఘటన తర్వాత నిరసనలతో సంబంధం ఉన్నవారిని కూడా ఉరితీశఆరని ఐరాస చెబుతోంది. సమితి.. ఎప్పటినుంచో మరణ (ఉరి సహా ఏదైనా) శిక్షను రద్దుచేయాలని ఇరాన్ ను కోరుతోంది.