ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా : భారత్ మద్దతు అందుకే...!

అందుకే ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్ర దాడులను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు.

Update: 2023-10-10 13:36 GMT

ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. యూదులకు ఒక భూ భాగం ఉండాలని పాలస్తీనాలో ఉన్న ప్రదేశాన్ని సొంత రాజ్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గా నామకరణం చేసి ఇప్పటికి ఏనిమిది దశాబ్దాలుగా పాలిస్తూ వస్తున్నారు.

ఒకనాడు సొంత గడ్డ నుంచి బయటకు వచ్చి ఎన్నో దేశాలలో శరణార్ధులుగా బతికి ఎక్కడా సరైన ఆదరణ లభించక సంచార జాతులుగా మారిన యూదులు రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో ఇజ్రాయెల్ అనే సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది 1948 సంవత్సరంలో జరిగింది.

అలా ఎట్టకేలకు అంటే దాదాపుగా 12వ శతాబ్దం నుంచి 1948 దాకా అంటే ఎనిమిదిన్నర శతాబ్దాల పాటు నానా రకాలైన నరకాన్ని చూసిన యూదులు చివరికి తమ మాతృభూమికి చేరుకోగలిగామనే ఆత్మతృప్తితో జీవనాన్ని మొదలెట్టారు.

అయితే నాడు ఇజ్రాయెల్ కి లభించిన భూమి అంతా కొండలూ గుట్టలూ, ఏ మాత్రం నీటి వసతి లేనిది. అలాంటి భూమిలో అద్భుతాలు సృష్టించారు యూదులు. జాతి పునర్నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ భాగస్వాములు అయ్యారు. యూదులకు ప్రపంచంలో ఏకైక దేశంగా ఇజ్రాయెల్ ఉంది ఇక యూదులు చాలా తెలివైన వారు. దాంతో వారు ఇజ్రాయెల్ ని అత్యంత శక్తివంతంగా మార్చారు.

ప్రతికూలతల నుంచి అనుకూలతలు సాధించిన చరిత్ర యూదులది. వారి నుంచే గ్రేటెస్ట్ సైంటిస్టులు, ఇంజనీర్లు వచ్చారు. అసలు ఏమీ పనికిరాదు అనుకున్న భూములలో నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని మొత్తం అంతా పచ్చదనంతో నింపేసారు. వ్యవసాయంలో కూడా గ్రేట్ అనిపించుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాలు ఈ రోజున ప్రపంచానికి వ్యవసాయ రంగంలో పరిచయం చేసింది ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలే అన్నది వాస్తవం.

అటు టెక్నాలజీలో మరో వైపు బిజినెస్ ఫీల్డ్ లో వారే ప్రపంచంలో ముందున్నారు. రక్షణ రంగం గురించి చెప్పనక్కరే లేదు. ఇజ్రాయెల్ పటిష్టంగా ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే అమెరికాకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వగలిగే స్థాయిలో ఉంది ఇజ్రాయెల్ అంటే ఆ దేశం గొప్పతనం ఆలోచించాలి.

స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పాటు అయితే చేసుకున్నారు కానీ గత ఎనిమిది దశాబ్దాలుగా యుద్ధాలతోనే ఇజ్రాయెల్ అలుపెరగని పోరాటం చేస్తోంది. అలా చూసుకుంటే కనుక 1948 నుండి 1983 వరకు మొత్తం ఆరు సార్లు పొరుగున ఉనన్ ఇల్సామిక్ దేశాలు ఇజ్రాయెల్ మీదకు దండెత్తి వచ్చాయి. 1956 లో సూయజ్ కెనాల్ విషయంలో దాడిచేసిన ఈజిప్టును మట్టికరిపించింది ఇజ్రాయెల్.

అదే తీరున 1967లో సిరియా, జోర్డాన్, లెబనాన్, సౌదీ, పాలస్తీనాలతో కలసి దాడి చేసిన ఈజిప్టు ని మట్టుబెట్టింది. ఆనాడు ఈజిప్టుకు చెందిన 300 యుద్దవిమానాలకు గానూ 280 విమానాలను మొట్టమొదటి రోజునే ఒక్క దెబ్బతోనే కుప్పకూల్చి లేవలేకుండా చావుదెబ్బ తీసి ఇజ్రాయెల్ శభాష్ అనిపించుకుంది. అంతే కాదు 1973 లో లెబనాన్ దేశాన్ని ఇజ్రెయెల్ చావు దెబ్బ కొట్టింది.

ఇపుడు చూస్తే అరబ్ దేశాలు ఉగ్రవాదాన్ని తెర వెనక నుంచి ప్రోత్సహిస్తూ ఇజ్రాయెల్ మీద పరోక్ష యుద్ధం చేస్తున్నాయి. హమాస్ అనే ఉగ్రవాద సంస్థ. గత మూడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ తో పెట్టుకుని యుద్ధ బీభత్సాన్ని సృష్టిస్తోంది

తాజాగా ఇప్పుడు మళ్లీ వీటి మధ్య మరోసారి ఘర్షణ మొదలైంది. ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా గా సాగుతున్న యుద్ధం కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతోంది. కేవలం భూభాగం కోసమే ఈ రెండూ తలపడుతూ వస్తున్నాయి. చివరిసారిగా 2021లో వీరి మధ్య యుద్ధం జరిగింది. గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్‌పై అయిదు వేల రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ అనే పాలస్తీనా ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా హమాస్‌ను హెచ్చరించింది. తమపై రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగారు. తాము యుద్ధంలో ఉన్నామని, ఈ వార్‌లో తామే తప్పకుండా గెలుస్తామని హమాస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం గాజీ స్ట్రిప్ వద్ద ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది.

ఇజ్రాయెల్ దేశంలో ప్రతీ పౌరుడూ ఒక యోధుడే. దేశం కోసం పోరడుతారు. ఆ దేశ జనాభాలో 16 ఏళ్ళు దాటిన యువకులకు మూడేళ్ల పాటు యువతులకు రెండేళ్ళ పాటు అర్మీలో శిక్షణ ఉంటుంది. ఇది కంపల్సరీ అన్న మాట. ఒక ఒక్కసారి యుద్దరంగంలోకి దిగితే చాలు బెబ్బులి మాదిరిగా విరుచుకుపడతారు ఇజ్రాయెల్ యూదులు. ఇజ్రాయెల్ ప్రపంచంలో ఎక్కువగా గౌరవించే దేశం భారత్. యూదులు 12వ శతాబ్దం తరువాత సొంత భూభాగం కోల్పోయి వలసలు పట్టిన నేపధ్యంలో అన్ని దేశాలలో వివక్షకు గురి అయ్యారు. ఒక్క భారతదేశం తప్ప. తమకు ఎంతగానో గౌరవించిన దేశం భారత్ అని యూదులు చెప్పుకుంటారు. నాటి బంధమే ఇపుడు కొనసాగుతూ వస్తోంది.

అందుకే ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్ర దాడులను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. వారికి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే అన్నది భారత్ విధానం అని చాటి చెప్పారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బెంజమిన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు మోదీ సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా తెలిపారు.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను నేతన్యాహూ తనకు ఫోన్ చేసి తెలియజేశారని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి యావత్ భారత్ అండగా ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

Tags:    

Similar News