ఇదేంది? సీఎం రేవంత్ కాన్వాయ్ ఇలానా!

ముఖ్యమంత్రిగా రేవంత్ కాన్వాయ్ కార్లలో పలు రంగులు ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు.

Update: 2023-12-14 04:47 GMT

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండాల్సిన ముఖ్యమంత్రి కాన్వాయ్.. చూసినంతనే లోపాలు కళ్ల ముందు కనిపించేలా ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయటం.. ఆయన ప్రయాణించే వాహనాల్ని కొంగొత్తగా సిద్ధం చేయటం తెలిసిందే. అయితే.. ఆయన కాన్వాయ్ లోని లోపాలపై ఆసక్తికర చర్చ జరగటమే కాదు.. ఈ మాత్రం జాగ్రత్తల్ని పోలీసుశాఖ ఎందుకు తీసుకోవటం లేదు? అన్నది ప్రశ్నగా మారింది.

సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని వాహనాల నెంబర్లు మొత్తం ఒకేలా ఉండటం.. ఒకే రంగులో ఉండటం.. ఏ వాహనంలో సీఎం ఉన్నారో అర్థం కాని రీతిలో జిగ్ జాగ్ గా ప్రయాణిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కార్ల క్రమాన్ని మారుస్తూ ఉంటారు. దీంతో.. ముఖ్యమంత్రి సరిగ్గా ఫలానా కార్ లో ఉంటారన్నది అర్థం కానట్లుగా ఉంటుంది. అయితే.. సీఎం రేవంత్ విషయంలో మాత్రం అలాంటిది లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ కాన్వాయ్ కార్లలో పలు రంగులు ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు.

ముఖ్యమంత్రి ప్రయాణించే కారు నలుపు రంగులో ఉంటే.. మిగిలిన కార్లు తెలుపు.. సిల్వర్ రంగులో ఉన్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రి ఏ వాహనంలో ఉన్నారో అస్సలు అర్థం కాకూడదు. కానీ.. కొట్టొచ్చినట్లుగా కనిపించటాన్ని తప్పుపడుతున్నారు. అంతేకాదు.. సీఎం రేవంత్ ప్రయాణించే కారు నెంబరు టీఎస్ 07 ఎఫ్ఎఫ్ 0009 నెంబరును కేటాయించారు. ఆయన కాన్వాయ్ లోని మిగిలిన కార్లకు టీఎస్09 ఆర్ఆర్0009గా కేటాయించారు. .ఇలా వేర్వేరు నెంబర్లు.. వేర్వేరు రంగుల్లో సీఎం రేవంత్ కాన్వాయ్ ఉండటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. వెంటనే.. వాహన కాన్వాయ్ ను మార్చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News