ఐటీ ఉద్యోగులకు అనారోగ్యాలు రావడానికి కారణాలేంటో తెలుసా?

ప్రస్తుత ప్రపంచంలో ఉద్యోగ నిర్వహణ కత్తి మీద సామే. సంస్థని మెప్పించి వారికి అనుకూలంగా పని చేయడమంటే మాటలు కాదు

Update: 2024-03-26 06:55 GMT

ప్రస్తుత ప్రపంచంలో ఉద్యోగ నిర్వహణ కత్తి మీద సామే. సంస్థని మెప్పించి వారికి అనుకూలంగా పని చేయడమంటే మాటలు కాదు. అందులో సాఫ్ట్ వేర్ జాబ్ లైతే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు. హెచ్ సీఎల్ వెల్లడించిన ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు రకాల ఉద్యోగాలు చేసే యువత అనారోగ్య సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా 56 వేల మందికి మెడికల్ టెస్టులు చేయగా అందులో వెలువడిన ఫలితాలు ఆందోళన కలిగిస్తు్నాయి. 77 శాతం మందికి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడుతున్నట్లు గుర్తించారు. 22 శాతం ఊబకాయం, 17 శాతం ప్రిడయాబెటిస్, 11 శాతం రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలా ఐటీ ఉద్యోగాలు చేసే వారిలో అనారోగ్య సమస్యలను చూస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థమవుతోంది.

ఐటీ ఉద్యోగుల ఉద్యోగ నిర్వహణ ఒత్తిడితో కూడినది. వారి ఆహార అలవాట్లు కూడా గతి తప్పుతున్నాయి. జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, సరైన ఆహార అలవాట్లు పాటించకపోవడం, నిద్ర లేమి, అల్కాహాల్, సిగరెట్లు, సంతానలేమి వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. దీంతో వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు.

ఐటీ జాబ్ పేరుకే గొప్ప. ఆచరణ మాత్రం కష్టం. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇలా ఐటీ ఉద్యోగులు తమ జీవితంలో అనారోగ్యాలతో సహవాసం చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనం ఎంత సంపాదించామన్నది కాదు. ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ముఖ్యం. అలా ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం గాల్లో కలిసిపోతోంది.

ఐటీ ఉద్యోగులు రోజురోజుకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. వారి జీవన విధానమే వారికి నష్టాలు తీసుకొస్తోంది. ఉద్యోగంలో వేళాపాలాలేని నిబంధనలతో వారి ఆరోగ్యం కత్తిమీద సాముగానే మారుతోంది. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే ఫలితం ఉంటుంది. ఇలా ఐటీ ఎంప్లాయిస్ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News