నాడు ఐటీ కి కేరాఫ్ గా....నేడు స్కిల్ డెవలప్మెంట్ అంటూ ...!

అందుకే తాజాగా వారంతా గచ్చే బౌలీ వద్దకు వచ్చి విప్రో సర్కిల్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఐ యాం విత్ సీబీఎన్ అంటూ వారు ప్ల కార్డులు ప్రదర్శించారు.

Update: 2023-09-13 14:00 GMT

చంద్రబాబు కోసం హైదరాబాద్ లో టెక్కీలు అంతా రోడ్డెక్కడం ఆశ్చర్యం కలిగించలేదు, సహజం అనిపించింది. ఎందుకంటే టెక్కీలలో చాలా మంది ఆంధ్రా నుంచి వెళ్ళినవారే. ఏపీ రాజకీయాల మీద వారికి అవగాహన చాలా ఉంది. అదే టైంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న కాలంలోనే ఐటీ ని హైదరాబాద్ వేదికగా అభివృద్ధి చేశారని, అలా తమకు ఉద్యోగావకాశాలు వచ్చాయన్న ఆలోచనలు వారిలో ఉన్నాయి.

అందుకే తాజాగా వారంతా గచ్చే బౌలీ వద్దకు వచ్చి విప్రో సర్కిల్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఐ యాం విత్ సీబీఎన్ అంటూ వారు ప్ల కార్డులు ప్రదర్శించారు. వెంటనే బాబుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ అన్నది రాజకీయంగా కక్షతో చేసినదే అని వారు నినదిస్తున్నారు. సేవ్ ఆంధ్రా అని కోరుతున్నారు.

మరో వైపు చూస్తే చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు హైదరాబాద్ లో ఐటీకి పునాదులు పడ్డాయి. అప్పట్లో మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా హైదరాబాద్ కి తరలివచ్చాయి. బిగ్ ఐటీ కంపెనీలు అదే బాటను పట్టాయి. అలా ఈ రోజు హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో ఐటీ వేళ్ళూనుకుంది. అలాగే మొదటి ఐటీ పార్క్ సైబర్ టవర్ అన్నది కూడా బాబు టైం లోనే వచ్చాయి.

ఇలా ఏపీ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది హైదరాబాద్ లో ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇక ఏపీ విభజన తరువాత 2014 నుంచు 2019 దాకా చంద్రబాబు తొలి సీఎం అయ్యారు. ఆయన టైం లో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో కుంభకోణం జరిగింది అని ఆరోపణల మీద ఈ నెల 9న నంద్యాలలో బాబుని అరెస్ట్ చేశారు

ఆయన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు జ్యుడీషియల్ కస్టడీ మీద రిమాండ్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు మూడు రోజులుగా ఆ జైలులో ఉంటున్నారు. మరో అయిదారు రోజుల పాటు కూడా ఆయన అక్కడ జైలులోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఐటీ కి వేదికగా కేంద్రంగా హైదరాబాద్ ని మార్చారని ఇమేజ్ ఉన్న చంద్రబాబు ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కూడా యువతకు ఉపాధి కోసం శిక్షణ అని రూపొందించారు. అయితే ఇందులో సీమెన్స్ సంస్థతో ఒప్పందాలే ఇపుడు కుంభకోణానికి దారి తీశాయని సీఐడీ నిగ్గు తేల్చింది. ఈ పరిణామాల క్రమంలో బాబు హయాంలో 371 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం మూలంగా ఖజానాకు చిల్లు పడింది అంటూ కేసులు పెట్టి జైలుకు పంపించింది.

ఇందులో నిజానిజాలు కోర్టులలో తేలుతాయి కానీ ఐటీ కి కేరాఫ్ గా పేరున్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఇపుడు జైలు గోడల మధ్యన ఉండడం మాత్రం రాజకీయ విచిత్రంగా చూడాలని అంటున్నారు. ఐ యాం విత్ సీబీఎ అని నినదించడం సంఘీభావం తెలపడం ఓకే కానీ కోర్టు తీర్పు ఎలా వస్తుందో కూడా ఓపికగా అంతా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News