పవన్ గాలి తీసేసిన జగన్ !

చాలా కాలానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఘాటైన సెటైర్ ని పేల్చారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్.;

Update: 2025-03-05 08:14 GMT

చాలా కాలానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఘాటైన సెటైర్ ని పేల్చారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. పవన్ ని పట్టుకుని చాలా పెద్ద మాట అనేశారు. పవన్ కి రాజకీయ అనుభవం లేదని అనవచ్చు, లేదా పాలనానుభవం లేదని కూడా అనవచ్చు.

కానీ ఆయనను కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకే తక్కువ అనేశారు. ఇదే ఎమ్మెల్యే పదవి కోసం రెండు చోట్ల పోటీ చేసి ఓడి అయిదేళ్ళ పాటు ఆ ఓటమి విషయంలో వగచి వాపోయిన పవన్ చివరికి విక్టరీ డ్యాం ష్యూర్ అన్న పిఠాపురం వచ్చి మరీ భారీ మెజారిటీతో తొలిసారి నెగ్గారు. ఎమ్మెల్యే తాను అయ్యాను అన్న ఆనందంతో ఆయన తొమ్మిది నెలలుగా ఉన్నారు. పైగా ఉప ముఖ్యమంత్రి హోదాని చంద్రబాబు ఇచ్చారు. ఇక కూటమి కట్టడం వెనక తన పాత్ర కీలకం అన్నది ఆయన భావిస్తూ వస్తున్నారు.

దానికి తగినట్లుగా అటు చంద్రబాబు ఇటు ప్రధాని మోడీ పవన్ ని ఎక్కువ మిక్కిలిగా గౌరవిస్తూండడంతో ఆయన రాజకీయంగా ఉన్నతమైన శిఖరాల మీద ఉన్నాను అనుకుంటున్న నేపథ్యం ఉంది. ఇక దేశంలో పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొని జాతీయ స్థాయిలోనూ అందరి దృష్టిలో ఉన్నాను అన్నది కూడా పవన్ తో పాటు ఆయన సైనికుల భావన.

సనాతన ధర్మం అజెండాతో సౌతిండియాలో తనదైన సరికొత్త పొలిటికల్ రూట్ కి లైన్ క్లియర్ చేసుకుంటూ ఏపీలో టీడీపీ వైసీపీలతో పాటుగా థర్డ్ ఫోర్స్ గా ఎమర్జ్ అవుతున్న జనసేనను అధినేతను పట్టుకుని జగన్ ఎమ్మెల్యేకు తక్కువ అన్న డైలాగ్ వేశారూ అంటే పాపం పవన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో అన్నది చర్చగా ఉంది.

ఓటమి తరువాత జగన్ ఎపుడూ పవన్ మీద కామెంట్స్ చేయలేదు. ఆయన పవన్ ని పక్కన పెట్టి బాబునే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే పవన్ మీడియా ముందుకు వచ్చి విపక్ష హోదా కావాల్సి వస్తే జగన్ జర్మనీ వెళ్ళాలీ అని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో రానున్న అయిదేళ్ళలో వైసీపీకి విపక్ష హోదా దక్కదని తేల్చి చెప్పారు. పైగా జగన్ కి తమ పార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చాయని ఎత్తి పొడిచారు

దాంతోనే జగన్ కి మండుకొచ్చిందని ఆయన ఈ విధంగా మీడియా ముందు పవన్ గాలి తీసేలా సెటైర్లు వేశారని అంటున్నారు. జగన్ ఇంతకీ ఏమన్నారూ అంటే అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని. అధికార పక్షం ఒక వైపు ఉంటే రెండవ వైపు ఉన్నది ఆటోమేటిక్ గా విపక్షమే అవుతుందని. అందువల్ల విపక్షంగా వైసీపీని గుర్తించకపోతే ఎలా అని.

అంతే కాదు ఇంతమంది సభ్యులు ఉంటేనే విపక్ష హోదా ఇస్తామని ఎక్కడా చట్టమూ లేదు రూలింగూ లేదని కూడా జగన్ తన వాదనను మీడియా ముఖంగా వినిపించారు. అందువల్ల ఈ విషయం పవన్ తెలుసుకోవాలని జగన్ సెటైర్లు పెల్చుతూ ఆయనను కార్పొరేటర్ గా చేసేసారు. ఎమ్మెల్యే పదవి ఆయనకు ఎక్కువ అని తేల్చేశారు. మొత్తానికి జగన్ వర్సెస్ పవన్ సెకండ్ ఇన్నింగ్స్ తొందరలో స్టార్ట్ అయ్యేలా ఏపీ పాలిటిక్స్ టర్న్ తీసుకుంటున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News