వాలంటీర్లపై విమర్శలకు అలా చెక్ పెట్టనున్న జగన్ సర్కార్!

గతకొన్ని రోజులుగా ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే! జనసేన అధినేత పవన్ కల్యాణ్... వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం దుర్వినియోగం అవుతుందని పదే పదే విమర్శలు చేస్తున్న తరుణంలో... చంద్రబాబు సైతం అందుకు అనుగుణంగానే స్పందించారని అంటున్నారు.

Update: 2023-07-15 05:16 GMT

గతకొన్ని రోజులుగా ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే! జనసేన అధినేత పవన్ కల్యాణ్... వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం దుర్వినియోగం అవుతుందని పదే పదే విమర్శలు చేస్తున్న తరుణంలో... చంద్రబాబు సైతం అందుకు అనుగుణంగానే స్పందించారని అంటున్నారు.

దీంతో... ఏపీలో జగన్ సర్కార్ ఎంపిక చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఉండాలా.. గత ప్రభుత్వ హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు కంటిన్యూ అవ్వాలా? వాలంటీర్ల సేవలు సంతృప్తిగా ఉన్నాయా.. లేదు, గతంలోని జన్మభూమి కమిటీలే కరెక్టుగా పనిచేశాయా? అనే విషయాలపై సర్వే చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో... ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... వచ్చే వారం గురజాలలో సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారని అంటున్నారు. “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే ఈ విషయం వెళ్లడించారని అంటున్నారు.

ముందుగా గురజాల నుంచి మొదలైనా.. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు-పవన్ ల జన్మభూమి కమిటీలు కావాలా.. జగన్ వాలంటీర్ల వ్యవస్థ కావాలా అనే అంశంపై సర్వే నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారని తెలుస్తుంది.

ఇదే సమయంలో సచివాలయంతో పాటు వాలంటీర్ల వ్యవస్థల వలన ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును జీర్ణించుకోలేకనే చంద్రబాబు - పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని కాసు ఆరోపించారని సమాచారం. ఇదే సమయంలో ఎవరు ఏమనుకున్నా.. వచ్చే ఎన్నికల్లో గ్రామ/వార్డు సచివాలయాలను, వాలంటీర్ల పనితీరును చూపించే ఓట్లు అడుగుతామని చెప్పారని తెలుస్తుంది.

ఈ సర్వేలో ప్రజల్ని భాగస్వాముల్ని చేసి అభిప్రాయ సేకరణ చేస్తామని చెబుతున్న కాసు మహేష్ రెడ్డి... ఈ సర్వే తర్వాత ప్రజలే ప్రతిపక్షాల చెంప చెల్ మనిపిస్తారని వెళ్లడించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా... వాలంటీర్ల విషయంలో వస్తోన్న విమర్శలకు ప్రభుత్వం సర్వే ద్వారా చెక్ పెట్టాలని భావిస్తోందన్న మాట అని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News