జమిలి జడుపుతోనేనా... జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటి?

జమిలి ఎన్నికలు పెడతామని కేంద్రం అంటోంది. కానీ దాని మీద ఇప్పటిదాకా రూట్ మ్యాప్ అయితే లేదు అని అంటున్నారు.

Update: 2024-12-07 06:00 GMT

జమిలి ఎన్నికలు పెడతామని కేంద్రం అంటోంది. కానీ దాని మీద ఇప్పటిదాకా రూట్ మ్యాప్ అయితే లేదు అని అంటున్నారు. ఎందుకంటే జమిలి ఎన్నికలు పెట్టడం అంత సులువు అయితే కాదు. ముందు దేశంలో జనాభా గణన జరగాలి. దానికి కచ్చితంగా రెండేళ్ల సమయం పడుతుంది. 2021లో జరగాల్సిన జన గణన కరోనా కారణంగా ఆగిపోయిందీ. అది 2025 లో స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. ఆ మీదట పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన సాగాలి.

ఈ మొత్తం కసరత్తు పూర్తి అయ్యేసరికి ఎంత కాదనుకున్నా మూడేళ్లకు పైగా సమయం పడుతుంది అని అంటున్నారు. ఇప్పటికే కొత్త ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి ఆరు నెలలు నిండింది. అంటే ఇవన్నీ ఎంత తొందరగా చేసినా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు గట్టిగా ఏడాది మాత్రమే గడువు ఉంటుంది. మరి అలాంటపుడు జమిలి ఎన్నికలు ఏ 2028లోనో జరుగుతాయని అంటున్నారు, లేదా ఆ ఏడాది కూడా పూర్తి చేసుకుని షెడ్యూల్ ప్రకారమే 2029లో ఎన్నికలు పెట్టుకోవచ్చు అని అంటున్నారు.

అయితే ఈ జమిలి ఎన్నికలు అన్నది వైసీపీని బాగా అలెర్ట్ చేసింది అని అంటున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగినా అధికారంలో ఉండే పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. వారికి అంగబలం అర్ధబలం అన్నీ సమకూరుతాయి. అదే విపక్షంలో ఉన్న వారు అయితే పూర్తిగా కూడదీసుకోవాలి. దాంతో పాటుగా జమిలి అంటే కేంద్రంలోని బీజేపీ జాతీయ అజెండాను ముందుకు తెస్తుంది. దానికి కాచుకుంటూ జనంలోకి వెళ్లాల్సి ఉంది.

ఈ నేపథ్యం నుంచి చూసినపుడు జమిలి ఎన్నికలు నిజంగా వైసీపీకి సవాల్ గానే ఉంటాయని అంటున్నారు. అందుకే జగన్ దాని మీద సీరియస్ గానే ఉన్నారని చెబుతున్నారు. లేకపోతే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. ఓటమి కూడా వైసీపీకి పచ్చిగానే ఉంది. మరి జగన్ నేరుగా జనంలోకి వెళ్లాల్సిన సందర్భం ఇదేనా అన్న చర్చ అయితే సాగుతోంది.

జనాలు ఇపుడు వైసీపీ అధినాయకుడు వెళ్ళినా ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న చర్చ ఉండనే ఉంది. అంతే కాదు వారు ఇంకా కూటమి మీద ఆశలతో ఉన్నారు. వైసీపీ హైకమాండ్ అనుకున్నతగా వ్యతిరేకత అయితే జనంలో లేదు. అది ఎంతో కొంత అసంతృప్తిగానే ఉంది. మరి ఆ అసంతృప్తి కాస్తా వ్యతిరేకతగా మారాలె అంటే సమయం చాలానే పడుతుంది.

మరి ఆదికి ముందు జగన్ ఎందుకు జనంలోకి వెళ్తున్నారు అంటే జమిలి ఎన్నికల తొందరతోనే అని అంటున్నారు పార్టీ చూస్తే ఎక్కడికక్కడ నిస్తేజంగా ఉంది. జిల్లా కమిటీలు వేసినా నియోజాక్వర్గాలకు ఇంచార్జిలను వేసినా కూడా ఎక్కడా అయితే చలనం అయితే లేదు. దాంతో తాను రంగంలోకి దిగితే తప్ప పార్టీ యాక్టివ్ కాదు అన్న ఆలోచనలతోనే జగన్ ఉన్నారని అందుకే ఆయన జిల్లా టూర్లకు రెడీ అవుతున్నారని అంటున్నారు.

ఇక పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలుసుకోవాలని కూడా చూస్తున్నారు. ఇలా పార్టీని ముందు చక్కదిద్దుకుంటే ఏపీలో మొత్తంగా తిరిగి ఒక కొలిక్కి తెచ్చుకుంటే జమిలి ఎన్నికలు వచ్చినా రెడీ అనేందుకు ఆస్కారం ఉంటుందని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి జమిలి ఎన్నికలు అంటే విపక్షాలే కొంత ఎగిరి గంతేయాలి. ఎందుకంటే అయిదేళ్ల సమయం కాస్తా మూడేళ్ళకు కుదించబడి మరోసారి చాన్స్ వస్తుంది. కానీ వైసీపీకి ఈసారి వచ్చిన ఫలితాల వల్లనే ఆ పార్టీ జమిలి ఎన్నికల మీద కొంత టెన్షన్ పడుతోందని అంటున్నారు. అందుకే జగన్ జనంలోకి వెళ్ళేందుకు ఆరాటపడుతున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News