కోర్టుకెక్కిన జగన్ ఆస్తుల గొడవ... ఏమిటీ కంపెనీ యాక్ట్ క్లాజ్ - 59?

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబలో ఆస్తి పంపకాల వ్యవహరం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తోంది.

Update: 2024-10-23 05:02 GMT

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు ఆస్తులు పరంగా కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వాటలు షర్మిళకు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు కథనాలొస్తున్నాయి.

అవును... వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబలో ఆస్తి పంపకాల వ్యవహరం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, షర్మిళకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ ల ట్రైబ్యునల్ లో పిటీషన్ దాఖలు చేశారనే విషయం వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం... సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన షేర్ల విషయంలో వైఎస్ జగన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఆమెకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు! ఈ మేరకు క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తరుపున జగన్, ఆయన సతీమణి భారతి ఈ పిటిషన్ వేశారు!

ఇందులో భాగంగా... వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, జనార్ధన్ రెడ్డి చాగరి, తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ కేతిరెడ్డి యశ్వంత్ రేడ్డిని ప్రతివాదులుగా చేర్చారు! కంపెనీ యాక్ట్ 59 కింద ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ట్రైబ్యునల్ విచారణకు స్వీకరించి.. విచారణను వచ్చేనెల 8కి వాయిదా వేసింది.

ఏమిటీ కంపెనీ యాక్ట్ క్లాజ్ - 59?

కంపెనీ యాక్ట్ క్లాజ్ - 59 ప్రకారం... ఏదైనా వ్యక్తి పేరును.. తగిన కారణం లేకుండా కంపెనీ సభ్యుల రిజిస్టర్ లో నమోదు చేయబడి ఉన్నా, లేదా.. రిజిస్టర్ లో నమోదు చేసిన తర్వాత తగినంత కారణం లేకుండా దానినుంచి విస్మరించబడితే.. కంపెనీలోని ఎవరైనా సభ్యుడు లేదా కంపెనీ సూచించిన రూపంలో అప్పీల్ చేయవచ్చు!!

ఈ క్లాజ్ కిందే వైఎస్ జగన్, వైఎస్ భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో షర్మిలకు ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆమెకు వాటాలు ఇవ్వడానికి అంగీకరించామని.. ఈ మేరకు 2019 ఆగస్టులో ఓ అవగాహన ఒప్పందాన్ని సైతం కుదురుచుకున్నట్లు తెలిపారని తెలుస్తోంది!

చెల్లెలు అనే ఒకే ఒక్క కారణంతోనే 2019లో షర్మిళకు వాటాలు ఇవ్వడానికి జగన్ అంగీకరించారని.. అయితే.. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారడం వల్ల సరస్వతి పవర్ లో ఆమెకు వాటాలను ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ కారణంతోనే ట్రైబ్యునల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News